India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైన 15 నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి కృష్ణా నుంచి 3 సెగ్మెంట్లు చోటు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ నమోదైన జాబితాలో 2వ స్థానంలో జగ్గయ్యపేట (89.89%), 10వ స్థానంలో పెడన (88.57%), 15వ స్థానంలో పామర్రు (88.12%) ఉన్నాయి. కాగా ఏపీలో అత్యధిక పోలింగ్ ప్రకాశం జిల్లా దర్శిలో (90.91%) నమోదైంది.
రేపు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆరుబయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జూన్ 28 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా జూన్ 4లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ కిరణ్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ను తనిఖీ చేసుకోవాలని ఆయన సూచించారు.
జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్లకు కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీఓ వాణి, శిక్షణా తరగతుల నోడల్ ఆఫీసర్ మురళీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
తాను అమెరికా వెళ్లినా విజయవాడ అమ్మాయినేనని.. అందుకే అందరూ తనని తెలుగు అమ్మాయేనని పలకరించారని నటి లయ అన్నారు. 2007లో అమెరికా వెళ్లిన ఆమె..ప్రస్తుతం పిల్లలు పెద్దగవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ‘అలీతో సరదా’ ఇంటర్వ్యూలో చెప్పారు. కోనేరు హంపీ తండ్రి దగ్గర తాను చెస్ నేర్చుకున్నట్లు తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాలేదని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు రాయడంపై చాలా బాధపడ్డట్లు ఆమె పేర్కొన్నారు.
ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజున ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే బాణసంచా విక్రయంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్న రీతిలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయ్యినట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధాని మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్‍లు ఎగరవేయటంపై కేంద్రం సీరియస్ అయ్యింది. డ్రోన్లు ఎగురవేసిన వారిపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
మండలంలోని మద్దూరులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులలో కార్తీక్(13) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందాడు. సెలవులకు వచ్చి కానరాని లోకానికి తనయుడు వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
జూన్ 4న నిర్వహించే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సీఈఓ మీనా జిల్లా కలెక్టర్లతో VC నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు. కౌంటింగ్ నిర్వహణకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ప్రతి టేబుల్‌కి ఒక సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ని నియమించామన్నారు.
Sorry, no posts matched your criteria.