India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సన్నాహాలను మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు పోలీస్ అధికారులు నిర్వహించిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని డీజీపీ నేడు తిలకించారు. కార్యక్రమంలో డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్(GAD), జిల్లా కలెక్టర్ సృజన, సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.
విజయవాడ SRR & CVR కళాశాలలో జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సులలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో ఇచ్చే ఈ శిక్షణకు ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ నెల 19లోపు SRR కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి చెప్పారు. శిక్షణ పూర్తైన అనంతరం APSSDC సర్టిఫికెట్లు ప్రధానం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగీ రాజీవ్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. ఏమీ తెలియని తన కుమారుడిని అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. తాను బలహీన వర్గాల నుంచి ఎదిగిన నాయుకుడినని తన కుంటుంబంపై ప్రభుత్వం కక్షసాంధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు కౌన్సిలింగ్‌కు అవసరమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నెల 15 వరకు ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరణకు అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ మేరకు మండల స్థాయి కౌన్సెలింగ్‌ను ఈ నెల 17కి వాయిదా వేశామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ సృజన తెలిపారు. మొత్తం 45 రోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని, ఈ సదస్సులో స్వీకరించిన ప్రతి అర్జీకి రిజిస్టర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సదస్సులపై ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు సంబంధిత అధికారులు సమీక్షలు నిర్వహిస్తారని, నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
కండ్రికకు చెందిన ఓ బాలిక(17)అదృశ్యమైన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 11.30 గంటలకు తన ఫ్రెండ్ ఇంటికెళ్లి వస్తానని చెప్పిన సదరు బాలిక సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని బాలిక తండ్రి పోలీసులకు చేశారు. బాలిక అదృశ్యమైన ఘటనపై ప్రమోద్ అనే యువకుడి హస్తముందని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నున్న పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా: గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రాను మారుస్తామని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సోమవారం ఆయన పలు జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
కృష్ణా: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల వివరాలు మండలాలవారీగా సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కిడ్నీ సమస్యలకు కారణాలు, కిడ్నీ రోగులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా జిల్లాలోని ఏ.కొండూరు తదితర ప్రాంతాల్లో సైతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.
ఎన్టీఆర్: వైసీపీ పాలకులు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.16,483 కోట్లు ఇస్తే, జగన్ తన అసమర్థతతో 20% కూడా ఖర్చు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాగునీరు ఇవ్వకుండానే జగన్ తన అవినీతితో అస్మదీయుల జేబులు నింపారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.