India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్‌లో వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో ఎం-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల (సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో శనివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. ఏటీఎంలు, వ్యాపార సముదాయాల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

ఈ నెలాఖరులోగా ఫ్రీహోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మార్వోల స్థాయిలో 682 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన పూర్తయిందని చెప్పారు.

జిల్లాలో అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తుల విలువ 15% పెరిగే విధంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్పీ కన్వెన్షన్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ పత్రం తయారీపై వివిధ వర్గాల వాటాదారులతో శనివారం కార్యశాల నిర్వహించారు.

అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పింఛన్లను సజావుగా పంపిణీ చేసేందుకు ముందు రోజు వారి పరిధిలోని సచివాలయంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్‌ను రూపొందించుకొని ప్రణాళికబద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు.

కలెక్టర్ DK బాలాజీని గుడివాడ RDO జి.బాలసుబ్రమణ్యం శనివారం కలిశారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ RDO బాలసుబ్రమణ్యంకు పలు సూచనలు చేశారు. అనంతరం RDO తన కార్యాలయానికి చేరుకొని పదివి బాధ్యతలు స్వీకరించారు.

గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను కలెక్టర్ జి.సృజన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోడౌన్‌కు వేసిన సీల్‌లు, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

తిరువూరు MLA సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ఓ పోస్టు తెగ వైరలైవతోంది. ‘అగ్ని పర్వతం బద్దలయ్య ముందు.. భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అని పోస్టు చేశారు. దీంతో ఆయన దేని గురించి ఆ వ్యాఖ్యలు చేసినట్టా అని ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.

నేడు విజయవాడకు ప్రముఖ సినీ నటి శ్రీలీల రానున్నారు. ఎంజీ రోడ్డులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు గడ్డే రామ్మోహన్, బోండా ఉమాహేశ్వరరావు, సుజనా చౌదరి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా హాజరుకానున్నారని సమాచారం.
Sorry, no posts matched your criteria.