India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆర్మీ టాస్క్‌ఫోర్స్(ఇంజినీర్) బృందం విజయవాడలో వరద బాధితులకు సేవలు అందించేందుకు ప్రత్యేక విమానంలో నగరానికి బయలుదేరింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. విపత్తు నిర్వహణలో సుశిక్షితులైన ఈ ఆర్మీ టాస్క్‌ఫోర్స్ బృందం వరద బాధితుల సేవలు తదితర అంశాలలో పాలుపంచుకుంటాయని తాజాగా సమాచారం వెలువడింది.
బుడమేరు వరదతో అల్లకల్లోలంగా మారిన విజయవాడ నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ పైవంతెనపైకి వాహనాల రాకపోకలను ప్రభుత్వం యంత్రాంగం అనుమతించింది. నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరణ జరగడంతో అక్కడి ప్రజలు సహాయ కేంద్రాల నుంచి తమ నివాసాలకు వెళుతున్నారు.
జిల్లాలో రేపు అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని డీఈఓ తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలల స్థితిగతులను పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను తరగతిలో కూర్చోబెట్టాలన్నారు.
గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో స్పై కెమెరాలు గుర్తించలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు గురించి ఆయన గురువారం వివరించారు. సీఎం ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా విచారణ జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. తమ విచారణలో కెమెరాలు, గానీ, ఆరోపణల్లో వినిపిస్తున్న వీడియోలు గానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఎవరూ చెప్పలేదన్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం ఏపీ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీంతో జోగి, ఆయన అనుచరుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
విజయవాడ డిప్యూటీ మేయర్ శ్రీశైలజ భర్త , వైసీపీ నేత అవుతు శ్రీనివాసరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని నివాసంలో అరెస్ట్ చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు వచ్చేవరకు ఆగకుండా తీసుకెళ్లారని మండిపడుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన విజయవాడలోని తన కార్యాలయంలో తెలిపారు. బుడమేరులో ప్రమాదకరస్థాయిలో వరద ఉద్ధృతి లేదన్నారు. మళ్లీ వరద వస్తే ముందుగానే ప్రజలకు సమాచారం అందిస్తామని చెప్పారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకొని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. బుడమేరు ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రతీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరిపేటకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు వైసీపీ పశ్చిమ ఇన్‌ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1:30కు రాజరాజేశ్వరి పేటలోని ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారని తెలిపారు. కాగా సోమవారం జగన్ విజయవాడ పాయికాపురం ముంపు ప్రాంతాలను పరామర్శించిన విషయం తెలిసిందే. జగన్‌తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.