India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ మీదుగా గుంటూరు-సికింద్రాబాద్(నం.12706&12705) మధ్య ప్రయాణించే ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు నెక్కొండ స్టేషన్‌లో స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్‌లో ఇచ్చిన స్టాప్‌ను కొనసాగిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్&సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఆగష్టు 15వ తేదీ నుంచి నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. విజయవాడలో అన్న క్యాంటీన్లను శుక్రవారం కలెక్టర్ సృజన, నగరపాలక సంస్థ కమీషనర్ ధ్యానచంద్ర, ఆర్డీవో భవానీ శంకరీలతో కలిసి కలెక్టర్ స్వయంగా పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఆగష్టు 15న వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం(ERS), పాట్నా(PNBE) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06085 ERS-PNBE ట్రైన్‌ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రతి శుక్రవారం, నం.06086 PNBE-ERS ట్రైన్‌ను ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వందలాది మంది చిన్నారులకు మహేశ్ బాబు పునర్జన్మనిచ్చారు. విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రి సహకారంతో ఆయన నిర్వహిస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ చిన్నారులకు విజయవంతంగా హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించింది. నేడు మహేశ్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు ఆయన అందజేసిన సేవాకార్యక్రమాలను జిల్లావాసులు కొనియాడుతున్నారు.
కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక శాఖ అధికారులు గురువారం మూసివేశారు. డబుల్ డెక్ క్రూయిజర్, ఇతర బోట్లను తీరంలో నిలిపేసిన అధికారులు బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున భవానీ ద్వీపంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని ఏపీటీడీసీ అధికారులు చెప్పారు.
విజయవాడకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారని కలెక్టర్ సృజన తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు అవుతారని తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కలెక్టర్ సృజన డీసీపీ చక్రవర్తి తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
* విజయవాడలో సీఎం చంద్రబాబు చీర కొన్నది.. ఎవరి దగ్గరంటే.?
* విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా
* విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ
* ‘కృష్ణాకు భారీ వరద.. నదిలో ప్రయాణించొద్దు’
* విజయవాడలో ఘోర విషాదం.. ఇద్దరి మృతి
* గుడివాడలో రెస్టారెంట్ ప్రారంభించిన సినీ హీరో
* విజయవాడ: ఫ్యాషన్ షోలో మెరిసిన యువతులు
ప్రయాణికుల రద్దీ మేరకు శుక్రవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి(నం.07249) ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 8 గంటలకు ఈ రైలు తిరుపతి చేరుతుందని తెలిపింది. ఈ రైలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలో ఆగుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
Sorry, no posts matched your criteria.