Krishna

News August 8, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రహదారుల అభివృద్ధికి నిధులిచ్చిన కేంద్రం

image

2024- 25 కేంద్ర బడ్జెట్‌లో జిల్లాలోని రహదారుల అభివృద్ధికి నిధుల కేటాయింపుల వివరాలు:
*మచిలీపట్నం- అవనిగడ్డ రహదారి రూ.8.12 కోట్లు
*NH 216 పెడన బైపాస్ రహదారి రూ.12.35 కోట్లు
*పామర్రు- ఆకివీడు రహదారి రూ.140.55 కోట్లు
*గుడివాడ- మచిలీపట్నం మధ్య ROB నిర్మాణానికి రూ.100.22 కోట్లు
*విజయవాడ భవానీపురం- కనకదుర్గ పైవంతెన మధ్య పనులకు రూ.15.21 కోట్లు

News August 8, 2024

విద్యార్థులకు అలర్ట్: పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీపీఈడీ, ఎంపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 19 నుంచి 22 తేదీల మధ్య ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 8, 2024

విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా

image

విజయవాడలోని ప్రభుత్వ ITI కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో SSC, ITI, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతతో పలు సంస్థలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విక్టర్ బాబు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 18- 30 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News August 8, 2024

కృష్ణా: ‘MA భగవద్గీత కోర్సుకు దరఖాస్తు చేసుకోండి’

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై ఎంఏ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా, అడ్మిషన్ గడువు ఈ నెల 14తో ముగియనుంది. కోర్స్ అడ్మిషన్, పూర్తి వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్‌లోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు DR శర్మ తెలిపారు.

News August 8, 2024

విజయవాడలో సీఎం చంద్రబాబు చీర కొన్నది.. ఎవరి దగ్గరంటే.?

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లెల నాగేంద్ర ఉప్పాడ చేనేత చీరలతో విజయవాడలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాగేంద్ర వద్ద రూ.20వేలకు ఉప్పాడ చీరను కొనుగోలు చేశారు.

News August 7, 2024

కృష్ణా: LLB రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన LLB కోర్సుల 3, 7, 9వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 7, 2024

కృష్ణా: కాంట్రాక్టర్లకు కీలక సూచనలు చేసిన కలెక్టర్ బాలాజీ

image

ప్రభుత్వం అప్పగించిన పనులను నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ వేగవంతంగా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన మచిలీపట్నంలోని తన కార్యాలయంలో వివిధ శాఖలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఆయా శాఖల ఇంజనీర్లతో సమావేశమయ్యారు. జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని ఇంజినీరింగ్ విభాగం పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ సూచించారు.

News August 7, 2024

పంచాయితీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

కలెక్టర్ సృజన బుధవారం విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్, ఉపాధి హామీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News August 7, 2024

స్పోర్ట్స్ క్యాలెండర్‌ రూపొందించండి: కలెక్టర్ బాలాజీ

image

కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సమావేశం బుధవారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ DK బాలాజీ అధ్యక్షత వహించారు. స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి విస్తృతంగా కృషి చేయాలని ఆయన క్రీడా శాఖ అధికారులకు సూచించారు.

News August 7, 2024

కృష్ణా జిల్లాలో PACSల బలోపేతానికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా PACSల కంప్యూటరీకరణ, PACSలలో విద్యుత్, హార్డ్వేర్, PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు తదితర అంశాలపై సమీక్షించారు.