India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులు(2024-25విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఫీజు, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- సికింద్రాబాద్(SC) మధ్య ప్రయాణించే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లు 4 రోజుల పాటు వరంగల్‌లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12739 VSKP- SC రైలు ఈ నెల 25 నుంచి 28 వరకు, నం.12740 SC-VSKP రైలు ఈ నెల 26 నుంచి 29 వరకు వరంగల్‌లో ఆగవన్నారు. ఆయా తేదీలలో ఈ 2 రైళ్లకు ఖాజీపేటలో ప్రత్యామ్నాయంగా స్టాప్ ఇచ్చామన్నారు.

కృష్ణా జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన మేనేజర్, పారా మెడికల్ పర్సన్, బ్లాక్ కో-ఆర్డినేటర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ICDS పీడీ ఎస్. సువర్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తులను సెప్టెంబర్ 30లోపు కానూరు ఉమాశంకర్ నగర్‌లో ఉన్న మహిళా సంక్షేమ సాధికారత కార్యాలయంలో అందజేయాలన్నారు.

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు(GNT)- విశాఖపట్నం(VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను 2 రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు నం.17239 GNT-VSKP మధ్య ప్రయాణించే రైలును ఈ నెల 29,30వ తేదీల్లో, నం.12740 VSKP-GNT రైలును ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాన్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీఎం, మంత్రి లోకేశ్ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం బాలుడు దేవాన్ష్ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కన్న కొడుకునే తల్లి హత్య చేసిన ఘటన గంపలగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ-బీసీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు(39)మద్యానికి బానిసై తల్లిని వికృత చేష్టలతో వేధిస్తుండేవాడు. విసిగిన తల్లి ఈనెల 18న రాత్రి రోకలి బండతో కొడుకు తలపై కొట్టింది. తీవ్ర గాయమైన అతడిని విజయవాడ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ.. శనివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్‌మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.

కొవ్వూరు- కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లు నం.22701 విశాఖపట్నం- గుంటూరు, నం.22702 గుంటూరు- విశాఖపట్నం రైలును ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

విజయవాడ బందర్ రోడ్డులో బాడీ స్పా సెంటర్ పై శనివారం పోలీసులు దాడి చేశారు. మాచవరం -టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి బాడీ మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు యువతులు, ఇద్దరి యువకులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు బాడీ మసాజ్ పేరిట క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రకాశ్ చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రం సైతం బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే.

విజయవాడ మీదుగా పుదుచ్చేరి(PDY)-హౌరా(HWH) మధ్య ప్రయాణించే 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు రాజమండ్రిలో దక్షిణ మధ్య రైల్వే ప్రయోగాత్మకంగా స్టాప్ ప్రవేశపెట్టింది. ప్రయాణికుల సౌలభ్యం మేరకు రాజమండ్రిలో ఇచ్చిన ఈ స్టాప్‌ను పొడిగిస్తున్నామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నం.12868 PDY-HWH రైలు ఈ నెల 25 నుంచి, నం.12867 HWH-PDY రైలు ఈ నెల 22 నుంచి రాజమండ్రిలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.