Krishna

News August 3, 2024

లబ్దిదారులకు చెక్కులు అందజేసిన కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో హౌసింగ్ పథకానికి సంబంధించిన పలువురు షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు కలెక్టర్ సృజన శనివారం విజయవాడలోని కలెక్టరేట్‌లో చెక్కులు అందజేశారు. వారికి స్థానికంగా పథకాలు అందుతున్న విధానం, గృహనిర్మాణంలో పురోగతి తదితర అంశాలపై ఆమె వారితో చర్చించారు. ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకుని స్వావలంబన సాధించాలని కలెక్టర్ సూచించారు. 

News August 3, 2024

విజయవాడ: ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

image

ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన యువతిని రేవంత్ అనే యువకుడు 3 నెలల నుంచి ఆమె వెంటపడి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని యువకుడు బెదిరించడంతో కుటుంబ సభ్యులతో కలిసి యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News August 3, 2024

విజయవాడలో యువతి మిస్సింగ్ 

image

పాయికాపురం ప్రాంతానికి చెందిన ఒక యువతి (20) బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి కనిపించలేదని యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి ప్రకాశం జిల్లాలో డిగ్రీ చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. రాత్రి అందరితో కలిసి ఇంట్లో ఉండగా.. అర్ధరాత్రి దాటిన తరువాత ఇంట్లో చూడగా యువతి కనిపించలేదు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నున్న పోలీసులు చెప్పారు. 

News August 3, 2024

వల్లభనేని వంశీ ఎక్కడ.?

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. నిన్న వంశీ అరెస్ట్ అయ్యారంటూ ప్రచారం సాగినప్పటికీ పోలీసులు ఖండించారు. వంశీ అమెరికాలో ఉన్నారా, ఇండియాలోనే ఉన్నారా అనే అంశంపై ఆయన సన్నిహితుల వద్ద సైతం సమాధానం లేదు. కాగా గన్నవరం TDP కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనలో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. 

News August 3, 2024

విజయవాడ: మైనర్ బాలికపై లైంగిక దాడి

image

అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్ నగర్‌లో ఓ మైనర్ బాలిక ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటుంది. సస్పెక్ట్ షీటర్ ప్రేమకుమార్ ప్రేమ పేరుతో వెంటపడి, గురువారం రాత్రి గుణదలలోని అతని బంధువుల ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు.

News August 3, 2024

రాష్ట్రంలో టాప్‌ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా

image

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 1,603 ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో తెలిపారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 207 ఉన్నాయన్నారు. ఏపీలో గుర్తించిన అన్ని బ్లాక్ స్పాట్లలో స్వల్పకాలిక మరమ్మతులను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారు. కాగా కృష్ణా జిల్లాలో 148 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

News August 3, 2024

కృష్ణా: బీపీఈడీ/డీపీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13 నుంచి Y20తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.

News August 2, 2024

ఎన్టీఆర్ జిల్లాలో భారీగా సీఐల బదిలీలు

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పనిచేస్తున్న 53 మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే పలు ఆరోపణలు రావటంతో వారిని ఏలూరు రేంజ్ కు అప్పగించారు. రేంజ్ నుంచి పలువురు సీఐలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కు వస్తున్నారు.

News August 2, 2024

ఆస్తుల జిరాక్స్ పత్రాల పద్ధతికి స్వస్తి: మాజీ మంత్రి దేవినేని

image

జగన్ హయంలో ఉన్న ప్రజల ఆస్తుల జిరాక్స్ పత్రాల పద్ధతికి టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన మరో హామీ అధికారంలోకి రాగానే చిత్తశుద్ధితో అమలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు నిరభ్యంతరంగా ఇకపై తమ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను పొందవచ్చని పోస్ట్ చేశారు.

News August 2, 2024

కృష్ణా: వందేభారత్ ప్రయాణికులకు తీపి కబురు

image

విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌లకు (నం.20833, 20834) సామర్లకోట‌లో ఇచ్చిన హాల్ట్‌ను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సామర్లకోట‌లో వందేభారత్‌‌కు ప్రయోగాత్మకంగా హాల్ట్ ఏర్పాటు చేయగా, దాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.