Krishna

News August 1, 2024

నిబంధనలు కచ్చితంగా పాటించాలి: కలెక్టర్ బాలాజీ

image

జిల్లాలో వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఆ మేరకు పనులు చేపట్టాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపాధి హామీ గృహ నిర్మాణం, టిడ్కో, విద్యుత్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

News July 31, 2024

కృష్ణా: పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం

image

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలని ఎస్పీ గంగాధర రావు అన్నారు. కృష్ణా జిల్లా పోలీసు అధికారులతో మచిలీపట్నంలో బుధవారం ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. యువత గంజాయి బారిన పడకుండా విద్యాలయాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News July 31, 2024

2,40,939 మందికి రూ.102.16 కోట్లు: కృష్ణా కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో నూరు శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. గురువారం జరగనున్న పెన్షన్ల పంపిణీపై బుధవారం ఉదయం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పెన్షన్ రూపేణా పంపిణీ చేయాల్సి ఉందన్నారు.

News July 31, 2024

సౌదీ నుంచి విజయవాడ చేరుకున్న మెహరున్నీసా

image

సౌదీలో పని నిమిత్తం వెళ్లిన మెహరున్నీసా అక్కడ అష్టకష్టాలు పడటంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి మంగళవారం రాత్రి ఆమెను విజయవాడకు తీసుకువచ్చారు. మెహరున్నీసా కష్టాలు తెలుసుకొని ఆమె కుటుంబ సభ్యులను తీసుకొని తెలుగు మహిళ విజయవాడ నగర నాయకురాలు సొంటి ఈశ్వరి మంత్రి నారా లోకేశ్, విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వద్దకు వెళ్లారు. వారు చొరవ తీసుకొని మెహరున్నీసాను క్షేమంగా విజయవాడ తీసుకువచ్చారు.

News July 31, 2024

కంచికచర్ల : పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

కంచికచర్ల మండలం కీసరలోని ఆర్సీఎం చర్చిలో ప్రేమ జంట వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. సోమవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి సతీశ్ అదే గ్రామానికి చెందిన సరళ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా ఎస్సై పండుదొర ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News July 31, 2024

విజయవాడలో కెనాల్ బోటింగ్‌కు ప్రణాళికలు

image

విజయవాడలోని బందరు, ఏలూరు, రైవస్ కాలువలను సుందరీకరించి కెనాల్ బోటింగ్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించాలని నగరపాలక సంస్థ(VMC) ప్లాన్ చేస్తోంది. కెనాల్ బోటింగ్ ప్రణాళిక రూపొందించాలని తాజాగా కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే త్వరలోనే పచ్చని ప్రకృతి మధ్య కాలువలలో బోటింగ్ చేసే అవకాశం ప్రజలకు దక్కుతుంది.

News July 30, 2024

ఐదేళ్లలో 719 గంజాయి కేసులు: విజయవాడ సీపీ

image

విజయవాడ నగర పరిధిలో గడిచిన ఐదేళ్లలో 719 గంజాయి కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు 100 రోజుల యాక్షన్ ప్లానింగ్ రూపొందించినట్లు తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే తక్షణమే తమకు తెలియజేయాలని సూచించారు. మత్తు పదార్థాల ఉచ్చులోకి విద్యార్థులు వెళ్లొద్దని సూచించారు.

News July 30, 2024

గంజాయిపై ఉక్కుపాదం.. విజయవాడ పోలీసులపై డీజీపీ ప్రశంస

image

100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏర్పాటైన ‘యాంటి నార్కోటిక్ సెల్’ బృందాలు మంగళవారం 46 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సెల్ ద్వారా ఇప్పటివరకు 77 మందిని అదుపులోకి తీసుకుని 28 కేసులు నమోదు చేసి 185 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా గంజాయి కట్టడికై విజయవాడ పోలీసుల చొరవను డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు.

News July 30, 2024

కృష్ణా: మూడు రైళ్లు రద్దు

image

చక్రధరపూర్‌ రైలు ప్రమాద ఘటన కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జూలై 31 & ఆగస్టు 2న నం.18189 టాటా- ఎర్నాకులం, ఆగస్టు 1న నం.02863 హౌరా- యశ్వంత్‌పూర్, ఆగస్టు 3న నం.02864 యశ్వంత్‌పూర్- హౌరా రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

News July 30, 2024

విజయవాడ: 2 గంటల్లో బాలికను కనిపెట్టిన పోలీసులు

image

తల్లి మందలించిందనే కారణంతో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పోలీస్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను రెండు గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.