India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సైబర్ భద్రత, రహదారి భద్రత, మహిళలు & బాలల భద్రతపై అవగాహన కల్పించేలా 1- 3 నిముషాల నిడివితో కూడిన వీడియో కాంటెస్ట్‌ను విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు 3 కేటగిరీలలో ఎంపికైన బెస్ట్ వీడియోలకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు నగదు బహుమతి ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆగస్టు 5లోపు రిజిస్టర్ చేసుకుని, 15లోపు తమ వీడియోలను vzapolicevideocontest@gmail.comకు పంపాలని కోరారు.
ఎన్టీఆర్: తన ప్రచారపిచ్చితో రాష్ట్ర ఖజానాను జగన్ గుల్ల చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. తన ముచ్చట తీర్చుకునేందుకు మాజీ సీఎం జగన్ రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. రీ సర్వేలో అవకతవకలు చేయడమే కాక, ప్రజల ఆస్తులపై జగన్ తన పేరు బొమ్మలు వేసుకుని అహంకారపూరితంగా వ్యవహరించాడని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు సోమవారం సంచలన తీర్పునిచ్చారు. విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికను గురుసాయిచంద్ర పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2019 సెప్టెంబర్ 29న చంద్ర సాయి, గొల్లసాయి, తరుణ్ బాలికను రూంకు తీసుకెళ్లి మత్తుమందు కలిపి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలలలో MBA/ MCA విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13, Y14, Y15, Y16, Y17, Y18తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివచంద్రారెడ్డి గన్‌మెన్లను ఇటీవల ఉపసంహరించడంపై హైకోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ శివారు గొల్లపూడి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ అని స్థానికులు గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు 100% పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉద్యోగులను ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 2,42,321, ఎన్టీఆర్ 2,35,477 మందికి గత నెలలో పింఛన్ అందజేశారు. ఆగస్ట్ నెలలో ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50-100 మంది లబ్ధిదారులు ఉండేలా సంబంధిత అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.
ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు అర్హుల జాబితాను ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లు అడ్మిషన్లు కన్వీనర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 736 సీట్లు మిగిలిపోయాయన్నారు. వాటి భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.