India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు (సోమవారం) కలెక్టరేట్లో ఉ.10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో సోమవారం జరగనున్న ఆర్చరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీక్షణకు విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అకాడమీలో శిక్షణ పొందిన బొమ్మదేవర ధీరజ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు దేశానికి పతాకం అందించడం ఖాయమని అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ తెలిపారు.
గుడ్లవల్లేరులోని AANM & VVRSR పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం కృష్ణా జిల్లాలోని ప్రావిడెంట్ ఫండ్ వినియోగదారుల కోసం “ప్రావిడెంట్ ఫండ్ మీ ముంగిట” సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో భవిష్యనిధి పరిధిలోకి వచ్చే యజమానులు, ఉద్యోగులు, పింఛనుదారులు, వాటాదారులకు లభించే సేవలు, పథకాల గురించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో విజయవాడ- ఏలూరు మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
క్రెడిట్ కార్డులోని నగదు మాయమైన ఘటనపై భవానీపురం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకట రమేశ్ అనే వ్యక్తి ఫోన్‌కు ఈనెల 10న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు ఏడాది కాలపు ఛార్జీ చెల్లించాలన్నాడు. వాట్సప్‌లో ఓ లింక్ పంపుతానని, దాని ప్రకారం డబ్బులు చెల్లించాలన్నారు. అనంతరం తన 2 కార్డుల నుంచి రూ.1,98,460లు మాయమైనట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా మచిలీపట్నం, భీమవరం నుంచి విజయవాడ వచ్చే పలు రైళ్లు జులై 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నం, భీమవరం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.
విజయవాడ, బిట్రగుంట మధ్య ప్రయాణించే మెము రైళ్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు నం.07978 విజయవాడ-బిట్రగుంట, నం.07977 బిట్రగుంట-విజయవాడ మెము రైలును జులై 29 నుంచి ఆగస్టు 4 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
విజయవాడ రూరల్ మండలం రాయనపాడులో ఒంటరి మహిళపై మాజీ హోంగార్డు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒంటరి మహిళ ఇళ్లల్లో పని చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. 8ఏళ్ల కిందట గతంలో హోంగార్డుగా పనిచేసిన నాగరాజు ఆమెను వేధించడంతో పోలీసులు విధుల నుంచి తొలగించారు. శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డగించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు(HC-2991) ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాచ్ సభ్యులు నాగరాజు కుటుంబానికి రూ.63వేల ఆర్థికసహాయం అందించారు. శనివారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో నాగరాజు కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ గంగాధర్ వారు కూడగట్టిన రూ.63 వేలు అందజేశారు. దాతృత్వం ప్రదర్శించిన సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
* పెనమలూరులో బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి
* ఉమ్మడి కృష్ణా జిల్లాకు నేడు వర్షసూచన
* కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్
* విజయవాడ: RTC బస్సు కింద పడి మహిళ మృతి
* విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు NTR పేరు పెట్టండి
* వైసీపీ అధినేత YS జగన్‌కు ఎంపీ కేశినేని చిన్ని సవాల్
* కూటమి ప్రభుత్వంపై పోతిన మహేశ్ ఫైర్
Sorry, no posts matched your criteria.