Krishna

News July 27, 2024

విజయవాడలో 31న షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

image

రామవరప్పాడులోని సెయింట్ ఆన్స్ పాఠశాల క్రీడా మైదానంలో జులై 31న కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, విజయ్ కుమార్ శనివారం తెలిపారు. ఇక్కడ ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 10, 11 తేదీలలో కుప్పంలో జరగబోయే రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.

News July 27, 2024

కృష్ణా: రేపు వెయిట్ లిఫ్టింగ్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు

image

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అండర్-17, అండర్-20, సీనియర్ స్త్రీ, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు జిల్లాల వెయిట్ లిఫ్టింగ్ సంఘాల కార్యదర్శులు రవి, నరేంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు ధ్రువపత్రాలతో రేపు ఉదయం 8గంటలకు స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాలు వద్దకు రావాలని సూచించారు. 

News July 27, 2024

కృష్ణా జిల్లా అభివృద్ధికి పాటుపడదాం: మంత్రి కొల్లు

image

జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం కొల్లు మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలలో సమన్వయంతో ముందుకు వెళదామన్నారు.

News July 27, 2024

కృష్ణా: బీ ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీ ఫార్మసీ విద్యార్థులకై నిర్వహించే సప్లిమెంటరీ(One time Opportunity) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. Y14, Y15, Y16తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

News July 27, 2024

‘విజయవాడ ఎయిర్‌‌‌పోర్ట్‌కు NTR పేరు పెట్టండి’

image

విజయవాడ ఎయిర్‌‌‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీవేంకటేశ్వర, ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News July 27, 2024

కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ఉమ్మడి జిల్లా మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17015/17016 విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం 2 GEN కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి 4 GEN కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17016 ట్రైన్‌ను నవంబర్ 14 నుంచి, 17015 ట్రైన్‌ను నవంబర్ 16 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 27, 2024

ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు: కలెక్టర్ బాలాజీ

image

జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. శుక్రవారం సచివాలయం నుంచి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.

News July 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గమనిక

image

విజయవాడ నుంచి తెనాలి వెళ్లే మెము రైళ్లను ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.07279 విజయవాడ-తెనాలి, నం.07575 తెనాలి-విజయవాడ మెము రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించింది.

News July 26, 2024

వేడుకలకు స్టేడియం సిద్దం చేయండి: కలెక్టర్‌ సృజన

image

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని కలెక్టర్‌ సృజన తెలిపారు. ఆగస్టు 15న స్థానిక మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య వేడుక పనులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధాన్యచంద్ర శుక్రవారం స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 

News July 26, 2024

సుజనా చౌదరికి మంత్రి పదవి?

image

రాష్ట్ర మంత్రివర్గంలో సుజనా చౌదరికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఒక మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఆయన కోసమే ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. ఆ సీటుపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో సుజనా చౌదరికే మంత్రి పదవి ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి ఆయన భారీ మెజార్టీలో గెలిచిన విషయం తెలిసిందే.