India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కార్గిల్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన భారత ఆర్మీ సైనికులకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ మాతృభూమిని రక్షించుకోవడానికి కార్గిల్ యుద్ధంలో సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారని గవర్నర్ కొనియాడారు.
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున ఆర్చరీ క్రీడలో బరిలోకి దిగిన విజయవాడ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర గురువారం జరిగిన మెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో సత్తా చాటాడు. ధీరజ్, తరుణ్‌దీప్, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 2,013 పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కాగా ధీరజ్ 681 పాయింట్లు సాధించి జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
ప్యారిస్ ఒలంపిక్స్‌లో భారత్ తరపున ఆర్చరీ క్రీడలో బరిలోకి దిగిన విజయవాడ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర గురువారం జరిగిన మెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో సత్తా చాటాడు. ధీరజ్, తరుణ్‌దీప్, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 2013 పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. కాగా ధీరజ్ 681 పాయింట్లు సాధించి జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
* సౌదీకి కృష్ణా జిల్లా దంపతులు.. చిత్రహింసలు
* విజయవాడలో బాలికపై అత్యాచారం
* గుడివాడ-మచిలీపట్నం హైవేపై ప్రమాదం
* విజయవాడ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తాం: మంత్రి అశ్విని
* ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ MLAలపై ఎన్ని కేసులంటే.!
* కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
* విజయవాడ: జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఫైర్
* ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తాం: బొండా ఉమా
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన పీజీ 3వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సీటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9792 మంది హాజరు కాగా వారిలో 5670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు చెప్పారు.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో CM చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత MLAలపై YCP ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం కొల్లు రవీంద్ర 15, బొండా ఉమా 12, యార్లగడ్డ వెంకట్రావు 7, కొలికపూడి శ్రీనివాసరావు 8, మాజీ MLC బుద్ధా వెంకన్నపై 3 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమపై అత్యధికంగా 27కేసులు పెట్టి ఒకసారి అరెస్ట్ చేశారు.
గన్నవరంలో విమానాశ్రయ విస్తరణలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, భూముల నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించారు. అధికారులు మాట్లాడుతూ.. విమానాశ్రయం ప్రహారీ లోపల విద్యుత్ స్తంభాలు తొలగింపు పూర్తయిందన్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 50 ఏళ్లకు ఉపయోగపడేలా విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఒక విజన్‌తో అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఈ స్టేషన్ ఉన్నందున విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
Sorry, no posts matched your criteria.