India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో CM చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత MLAలపై YCP ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం కొల్లు రవీంద్ర 15, బొండా ఉమా 12, యార్లగడ్డ వెంకట్రావు 7, కొలికపూడి శ్రీనివాసరావు 8, మాజీ MLC బుద్ధా వెంకన్నపై 3 కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమపై అత్యధికంగా 27కేసులు పెట్టి ఒకసారి అరెస్ట్ చేశారు.
గన్నవరంలో విమానాశ్రయ విస్తరణలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి, భూముల నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించారు. అధికారులు మాట్లాడుతూ.. విమానాశ్రయం ప్రహారీ లోపల విద్యుత్ స్తంభాలు తొలగింపు పూర్తయిందన్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 50 ఏళ్లకు ఉపయోగపడేలా విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఒక విజన్‌తో అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఈ స్టేషన్ ఉన్నందున విస్తృతంగా అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామంలోని గుడివాడ-మచిలీపట్నం హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం ధాటికి మృతదేహం నుజ్జు నుజ్జుగా మారిందని స్థానికులు తెలిపారు. బాధితుడి ఏపీ 39 ఈవీ 8684 నంబర్ గల బైక్ ఘటనా స్థలంలోనే పడి ఉంది. గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లా ఖనిజ ఫౌండేషన్స్ ట్రస్ట్ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ట్రస్ట్ నిధుల వినియోగంపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏఏ పనులు పూర్తయ్యాయి, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, టెండర్లు పిలవాల్సిన పనులపై రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
* ప్రకాశం బ్యారేజీ గేట్లు క్లోజ్
* కృష్ణా: బడ్జెట్ నిర్ణయాలతో ఆ 20వేల మందికి లబ్ధి
* విజయవాడ: తల్లి పెళ్లి వద్దన్నందుకు కుమారుడు ఆత్మహత
* నూజివీడు IIITలో మద్యం బాటిళ్ల కలకలం
* పెనమలూరు: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి
* ఎన్టీఆర్: నెల రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి
* విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
* జగన్ కొత్త డ్రామాలాడుతున్నాడు: బుద్ధా వెంకన్న
మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని బుధవారం రైల్వే సిబ్బంది గుర్తించారు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మండవల్లి రైల్వేస్టేషన్ ట్రాక్‌పై తెల్లవారు జామున 2:45 సమయంలో సిబ్బంది అజయ్ కుమార్ పెట్రోలింగ్ చేస్తుండగా.. ప్లాట్ ఫారం సమీపంలో యువకుడి మృతదేహం కనిపించింది. రైల్వే SI కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడకు తరలించారు.
పీఎం ముద్ర యోజన ఋణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడంతో కృష్ణా జిల్లాలో 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. వీరంతా గతంలో ముద్రా లోన్లు తీసుకుని క్రమంగా చెల్లిస్తున్న వారే. ఈ తరహా లోన్ గ్రహీతలకు కేంద్రం రూ.10 లక్షల పరిమితిని పెంచి రూ.20 లక్షలు లోన్ ఇస్తామని 2024- 25 బడ్జెట్లో ప్రకటించడంతో వీరికి రెట్టింపు లబ్ధి అందనుంది.
జి.కొండూరు మండలం చిన్న నందిగామకి చెందిన ఉప సర్పంచ్ బలుసు స్వామి (59) మంగళవారం చేపల వేటకు చెరువులోకి దిగి <<13690723>>ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.<<>> కాగా ఇటీవలే స్వామి పెద్దకుమారుడు మురళి(30) మైలవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. మురళి మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబం నెలలోనే స్వామి మరణవార్తతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కాగా గ్రామపంచాయితీ ఉపసర్పంచ్‌గా స్వామి ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC)కు కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాకు విస్తృత ప్రయోజనం కలగనుంది. సుమారు 800 కి.మీ మేర నిర్మించనున్న ఈ కారిడార్ జిల్లాలోని కంకిపాడు, గన్నవరం, మచిలీపట్నం మీదుగా వెళ్లనుంది. ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు మంజూరైన నేపథ్యంలో.. ఆయా పనులు ప్రారంభమైతే జిల్లా రూపురేఖలు మారతాయని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.