India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ల స్వీకరణలో భాగంగా 4వ రోజైన సోమవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 31 నామినేషన్లు దాఖలవ్వగా ఇందులో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 03, 7 అసెంబ్లీ స్థానాలకు 28 నామినేషన్లు పడ్డాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 04, గన్నవరం 02, గుడివాడ 08, పెడన 06, అవనిగడ్డ 02, పామర్రు 03, పెనమలూరు 03 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయి.
గుడివాడ నియోజకవర్గం నుంచి YCP MLA అభ్యర్థిగా కొడాలి నాని సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించేశారు. అఫిడవిట్ వివరాలివే..
➤ కుటుంబ ఆస్తుల మెత్తం విలువ రూ.3,88,25,411
➤ ల్యాండ్ మెత్తం విలువ రూ.9,29,00000
➤ అప్పులు మెత్తం రూ. 4,92,00458
➤ 5కార్లు, 3లారీలు, TVS స్కూటి ఉందన్నారు.
➤ ఆయనపై 15 కేసులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.
టెన్త్ ఫలితాల్లో చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని స్టేట్ మూడవ ర్యాంక్ సాధించింది. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన కనుపర్తి భావజ్ఞ సాయి 600కు 597 మార్కులు తెచ్చుకొని స్టేట్ మూడో ర్యాంక్ సాధించింది. నల్లబోతుల దివ్యశ్రీ 583 మార్కులు, మహమ్మద్ సబిహా బేగం 582 మార్కులు సాధించారు.
మండలంలోని తంబలంపాడు గ్రామంలో నరసింహారావు పొలంలో చేపల చెరువు మేత వేయడానికి వెళ్లిన వల్లూరి విజయబాబు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై చంటిబాబు తెలిపారు. బాపులపాడు మండలానికి చెందిన విజయ్ కుమార్ చేపల చెరువు వద్ద కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మేత వేసేందుకు పడవలో వెళ్లగా, పడవ బోల్తా పడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై వెల్లడించారు.
ఓటు హక్కు వినియోగం.. ప్రతి ఒక్కరి కర్తవ్యమని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందీరా గాంధీ స్టేడియంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్‌లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా స్థానం మెరుగు పడలేదు. గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా 11వ స్థానానికే పరిమితమైంది. ఈ సంవత్సరం ఉత్తీర్ణతా శాతం పెరిగింది. గత సంవత్సరం 19,670 మంది విద్యార్థులకు 14,688 మంది ఉత్తీర్ణులవ్వగా ఉత్తీర్ణతా శాతం (74.67%) ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం 21,112 మంది విద్యార్థులకు 19,011 మంది (90.03%) పాస్ అయ్యారు. గత సంవత్సరం కంటే 16.26% ఉత్తీర్ణత పెరిగింది.
కృష్ణా జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావు నేటి ఉదయం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కంకిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి విషయమై ముగ్గురు యువకులు ఘర్షణ పడినట్లు తెలిపారు. వణుకూరు, ఉయ్యూరు గ్రామాలకు చెందిన యువకులు బీరు బాటిళ్లతో జాతీయ రహదారి సమీపంలో దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. చెక్‌పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా ఆయన ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.