Krishna

News July 21, 2024

విజయవాడ దంత వైద్యశాలలో ఉద్యోగాలు

image

విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా, ఖాళీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ హైజీనిస్ట్-1, డెంటల్ టెక్నీషియన్-1, డెంటల్ మెకానిక్-1 పోస్టుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం https://gdchvja.in/ వెబ్సైట్ చూసుకోవాలని తెలిపారు.

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు: కలెక్టర్ సృజన

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ కలెక్టర్ సృజన తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0866-2575833 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News July 21, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు- దానాపూర్(నం.06185) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జూలై 22న మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ చేరుకుని 24వ తేదీ ఉదయం 1.30 గంటలకు దానాపూర్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News July 21, 2024

ఎన్టీఆర్: వాట్సప్ వాడేవారికి పోలీసుల ముఖ్య విజ్ఞప్తి

image

వాట్సప్ వాడేవారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. అపరిచిత నెంబర్ల నుండి వాట్సప్ సందేశాలలో వచ్చిన apk ఫైల్స్ క్లిక్ చేయవద్దని ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ తరహా apk ఫైల్స్ క్లిక్ చేయడంతో మొబైల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుందన్నారు. వాట్సాప్ వినియోగించేవారు అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాల బారిన పడొద్దని పోలీసులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 

News July 21, 2024

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు: కలెక్టర్ సృజన

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ కలెక్టర్ సృజన తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0866-2575833 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News July 21, 2024

కృష్ణా: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ తెలిపారు. భారీ వర్షాలు, వరదలు వల్ల ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.

News July 20, 2024

ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

image

ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా IAS అధికారి నిధి మీనాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. తాజాగా 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ఉత్తర్వులు విడుదల చేయగా, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనాను నియమించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న సంపత్ కుమార్‌ను బదిలీ చేసింది.

News July 20, 2024

కృష్ణా: ఇంకా దొరకని MPDO వెంకటరమణ ఆచూకీ

image

ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఏలూరు కాలవను జల్లెడపడుతున్నా ఇంత వరకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో ఎంపీడీవో ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది. 

News July 20, 2024

కృష్ణా యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

భారీ వర్షాలతో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కారణంగా శనివారం కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జరగనున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన డిగ్రీ 5, 6వ స్పెషల్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 26న, ఫార్మ్-డీ 4వ ఏడాది పరీక్షలను ఈ నెల 22న నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది.