India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో యూవీ. సుబ్బారావు శనివారం ఉదయం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. కావున ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు గమనించాలని పేర్కొన్నారు.

జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పటిష్ఠంగా అమలు చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి అన్నారు. పామర్రు శ్రుతి వైద్యశాల, కూచిపూడిలోని నర్సింగ్ హోమ్‌లో స్కానింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తప్పని సరిగా చట్ట పరిధిలో నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు.

ఎన్టీఆర్ జిల్లా లా అండ్ ఆర్డర్ డీసీపీగా గౌతమ్ శాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేరుగా వచ్చి తనను సంప్రదించవచ్చన్నారు. గతంలో ఆమె అనంతపురం ఎస్పీగా పని చేసి విజయవాడ డీసీపీగా వచ్చారు.
మంత్రి కొల్లు రవీంద్రను జనసేన మహిళా నేత రాయపాటి అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఆమె అన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాతో ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ గెస్ట్ ఉపాధ్యాయ/అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న డెమో నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి ప్రేమావతి తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఈ డెమో జరగనున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఉద్యోగాలకు బీఈడీ, పీజీ, టెట్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.
ఇన్‌స్ట్రాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక(16)ఇల్లు వదిలి అదృశ్యమైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలో జరిగింది. కుంటుంబ సభ్యుల వివరాలు.. బాలిక 10వ తరగతి పూర్తి చేసింది. తరచూ..ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి ప్రశ్నించింది. తిరుపతికి చెందిన జాన్సన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి మందలించింది. ఆ రాత్రి నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడలోని VMC సర్ విజ్జి ఈత కొలనులో ఆగస్టు 4న ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఆక్వాటిక్ జట్టు ఎంపిక పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆక్వాటిక్ సంఘ కార్యదర్శి రమేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే స్విమ్మర్లు(17-25 సంవత్సరాలలోపు వారు మాత్రమే) జులై 30లోపు జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య UID సంఖ్యతో ఆక్వాటిక్ సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని రమేశ్ సూచించారు.
Sorry, no posts matched your criteria.