India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న తొలి తెలుగు మహిళగా మచిలీపట్నంకు చెందిన మేరీ లైలారావు ఘనత వహించారు. ఆమె తన తండ్రి MK రావు ప్రోత్సాహంతో 100 మీ. పరుగు, 80 మీ. హర్డిల్స్‌లో శిక్షణ తీసుకుని.. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన విశ్వక్రీడల్లో బరిలోకి దిగారు. ఆ పోటీల్లో ఆమె తొలి రౌండ్‌లోనే వెనుదిరిగినా ఆసియాలో అత్యంత వేగంగా పరిగెత్తే మహిళగా నిలిచారు. 1958లో జరిగిన ఆసియా క్రీడల్లో లీలా కాంస్యం గెలిచారు.
కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన ఇంటింటి సర్వే జిల్లాలో గురువారం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన సర్వే ఆగస్ట్ 2వ తేదీ వరకు సాగనుంది. సర్వే నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నాయి. ఇంటింటి సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జి. గీతాబాయి పర్యవేక్షిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే “నేషనల్ టీచర్ అవార్డ్స్-2024″కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు https://nationalawardstoteachers.education.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 4, 5 తేదీలలో అవార్డులు అందజేస్తామని పేర్కొంది.
పామాయిల్ సాగుతో దీర్ఘకాలం అధిక ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో ఉన్న పతాంజలి, వాహ్యన్ కాఫీ, 3ఎఫ్ పామాయిల్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పామాయిల్ సాగు విధానం, బిందు సేద్యం, సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీలు, రైతుల నుంచి కంపెనీలు పంట సేకరించే విధానంపై ఆయన చర్చించారు.
బెంగళూరు పర్యటనను ముగించుకొని మాజీ సీఎం జగన్ గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్‌కు విమానాశ్రయంలో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
పమిడిముక్కల మండలం తాడంకిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తాడంకి గ్రామానికి చెందిన రాంబాబును పచ్చడి బండతో తలపై కొట్టి తల్లి హత్య చేసిందన్నారు. తాగిన మత్తులో పలుమార్లు తల్లిపై అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని హత్య చేసిన తల్లి పద్మను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామన్నారు.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19, 26వ తేదీలలో విజయవాడ- ఏలూరు మీదుగా కాక.. విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
టమాటాల ధరలు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నియంత్రణా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న టమాటాలకు కిలో రూ.56గా నిర్ణయించారు. అయితే నగరంలోని రైతు బజార్లకు 3 టన్నుల పైచిలుకు (119 ట్రేలు) ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. రైతుబజార్లలోని దుకాణదారులు సొంతంగా తెచ్చుకున్న వారి టమాటాల ధర రూ.80లుగా ఉంది. కొరత క్రమంలో ప్రభుత్వం మదనపల్లె ప్రాంతాల్లో నేరుగా కొనుగోలు చేసి మన మార్కెట్లకు తెస్తుంది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆక్రమించిన భూముల విలువ రూ.35,576 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు, ఉచిత ఇసుక పేరుతో రూ.9,750 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.