India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 8, 12,14,17, 20, 22 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
మాజీ సీఎం జగన్ రేపు విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన మధ్యాహ్నం 2:25 గంటలకు బయలుదేరి 3.45గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గన విజయవాడ మొగల్రాజపురంలోని సన్రైజ్ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆదివారం గాయపడిన వైసీపీ నేత శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తాడేపల్లి స్వగృహానికి చేరుకుంటారు.
గుడివాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బండి ప్రేమ్ కుమార్ (26) సోమవారం పెద్ద కాలువలో పడి బైక్ మెకానిక్ మృతి చెందాడు. అతను ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రేమ్ కుమార్ మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అడ్డదారిలో రూ.కోట్లు అర్జించడంలో అన్నా చెల్లెళ్లు ఆరితేరారు. ఇటీవల హైదరాబాద్‌లో రవిచంద్రారెడ్డి(29), ఆయన సోదరి చందనారెడ్డి అలియాస్ యామిని అలియాస్ సౌమ్య గుట్టు రట్టవడంతో వారి మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో ఉద్యోగాలు ఇస్తామని ఓ సంస్థ పేరుతో రూ.15 కోట్ల మేరా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.
మైలవరంలో అద్దె చెల్లించలేదని YCP కార్యాలయాన్ని మూసేశారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో కార్యాలయ్నాన్ని ప్రారంభించారు. అప్పట్లో నిర్వహణ భారం అధిష్ఠానమే భరించేది. కానీ పార్టీ ఓడిపోవడంతో రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు అందుబాటులో లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో మూసి వేశారని సమాచారం.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఎం.ఫార్మసీ, బీ.ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ(One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఆయా కోర్సుల విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.
ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) మూడేళ్ల డిప్యుటేషన్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన అర్హులైన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని CRDA వెల్లడించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలకై https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా జిల్లాలో భారీ మొత్తంలో ఎస్ఐలను బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. జిల్లాలోని 23 మంది ఎస్ఐలకు స్థానం చలనం కల్పించారు. అలాగే వీఆర్‌లో ఉన్న ఎస్ఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేసిన వారికి వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
తాడేపల్లి ఎయిమ్స్ రోడ్డు వద్ద ఆదివారం ఓ ప్రేమోన్మాది నర్సుగా పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన కావ్యపై బ్లేడ్‌తో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయవాడకు చెందిన క్రాంతిగా గుర్తించారు.
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అర్హులైన గిరిజన విద్యార్థుల కోసం డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని దీన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లాలో 30వ తేదిన గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.