India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైలవరం నియోజకవర్గంలో 85.36 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండలంలో ఓటర్ల చైతన్యం కనిపించింది. అడవి కొత్తూరు గ్రామంలోని 8వ పోలింగ్ కేంద్రంలో 99.22 శాతం మంది ఓటేశారు. మొత్తం 129 మంది ఓటర్లకు గానూ 128 మంది ఓటేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ పోలింగ్ బూత్‌లోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
* తిరువూరులో 2,07,190 మందికి 1,81,669 (87.68%)* విజయవాడ వెస్ట్ లో 2,55963 మందికి 1,70,104 (66.46%) (అత్యల్పం)* విజయవాడ సెంట్రల్ లో 2,77,724 మందికి 2,02,635 (72.96%)* విజయవాడ ఈస్ట్ లో 2,70,624 మందికి 1,93,026 (71.33%)* మైలవరంలో 2,81,732 మందికి 2,40,487 (85.36%)* నందిగామలో 2,05,480 మందికి 1,79,915 (87.56)* జగ్గయ్యపేటలో 2,05,364 మందికి 1,84,575 (89.88%) (అత్యధికం)
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 79.36శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జగ్గయ్యపేటలో 89.88%, విజయవాడ పశ్చిమలో 66.46శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
* విజయవాడ సెంట్రల్- 72.96%
* విజయవాడ తూర్పు- 71.33%
* తిరువూరు- 87.68%
* నందిగామ- 87.56%
* మైలవరం- 85.36%
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు ఏడుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు కూడా స్థానం దక్కింది. జిల్లాకు చెందిన వర్ల రామయ్య కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నంకు నేడు ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ ట్రైన్ (నం.08590) నేటి ఉదయం 10.30 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11.30కి విశాఖ చేరుకుంటుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ట్రైన్ విజయవాడ, గుడివాడ, కైకలూరుతోపాటు ఏపీలోని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.
జిల్లాలో పోలింగ్ శాతం 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో స్వల్పంగా పెరిగింది. 2019లో 84.36 శాతం ఓట్లు పోలవ్వగా ఈ ఎన్నికల్లో 84.45% మేర పోలయ్యాయి. 0.9% మేర మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలో మొత్తం 1,96,680 మంది ఓటర్లకు గాను 1,61,109 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.
ఉమ్మడి కృష్ణాలోని SC రిజర్వ్డ్ స్థానాలైన తిరువూరు, నందిగామ, పామర్రులో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. నందిగామ86.50%, తిరువూరు85.68%, పామర్రులో87.11% శాతం పోలింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగా ఈ స్థానాల్లో ఓటర్లు తమకే పట్టం కట్టారని వైసీపీ శ్రేణులు చెబుతుండగా, ఈ 3 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగరనుందని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. జూన్ 4న ఓటర్ల తీర్పు తెలియనుంది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మే నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ నెల 14వరకూ ఎన్టీఆర్ జిల్లాలో 82.59%, కృష్ణాలో 80.20% మేర రేషన్ పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రేషన్ పంపిణీలో జిల్లాలవారీగా ఎన్టీఆర్ 14వ, కృష్ణా 21వ స్థానంలో ఉన్నాయి. కాగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తమకు రేషన్ త్వరగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
* గన్నవరంలో 2,79,054 మందికి 2,36,848 (84.88%)
* గుడివాడలో 2,04,271 మందికి 1,68,537, (82.51%)
* పెడనలో 1,67,564 మందికి 1,48,413 (88.57%) (అత్యధికం)
* మచిలీపట్నంలో 1,96,680 మందికి 1,61,109 (81.91%)
* అవనిగడ్డలో 2,12,331 మందికి 1,82,600 (86.00%)
* పామర్రులో 1,84,632 మందికి 1,62,683 (88.11%)
* పెనమలూరులో 2,94,828 మందికి 2,33,413 (79.14%) (అత్యల్పం)
విజయవాడ మీదుగా వెళ్లే తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని రైల్వే అధికారులు మార్పులు చేశారు. ట్రాక్ నిర్వహణ కారణాల రీత్యా నం.17405 TPTY-ADB ట్రైన్‌ను ఈ నెల 16, 22 తేదీల్లో, నం.17406 ADB-TPTY ట్రైన్‌ను ఈ నెల 15, 21 తేదీల్లో విజయవాడ మీదుగా నడపమని అధికారులు తెలిపారు. విజయవాడ, మధిర, ఖమ్మం మీదుగా కాక తెనాలి, సికింద్రాబాద్ మీదుగా ఆయా తేదీల్లో ఈ రైళ్లు నడుపుతామన్నారు.
Sorry, no posts matched your criteria.