India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా వర్శిటీ పరిధిలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2024 జూలై, నవంబర్ నెలల్లో బీఈడీ విద్యార్థులకు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఉమ్మడి కృష్ణాలో అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఇక్కడ NDA కూటమి శ్రేణులు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అవనిగడ్డలో కూటమి అభ్యర్థులైన బాలశౌరి, బుద్ధప్రసాద్ ఎన్నికల గుర్తు ఒకటే కావడంతో తమకు భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యాయని కూటమి శ్రేణులు భావిస్తుండగా, జూన్ 4న ఈ ప్రశ్నకు సమాధానం లభించనుంది.
కృష్ణా జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను కృష్ణా విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు.
గుడివాడలో ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్ ప్రజలను ఆకర్షిస్తోంది. రాజకీయ నేతలు ఇచ్చిన సొమ్ము తీసుకొని ఓటు వేసిన ప్రజలకు తమ వద్ద వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనడానికి రావాలని రాసి ఉంది. ఈ బ్యానర్‌పై గుడివాడ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద మంగళవారం పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలను మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజీ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలించారు. ఈ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో సోమవారం విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వచ్చిన పలువురు వివిధ కారణాలతో మృతి చెందారు. పెనమలూరుకు చెందిన ఈశ్వరరావు(72) ఓటేసిన తర్వాత అస్వస్థతకు గురై మరణించగా.. పెనమలూరు మం. పెదపులిపాకకు చెందిన వెంకటేశ్వరరావు(75), కైకలూరు వాసి ప్రభాకరరావు(65) ఓటేసేందుకు వరుసలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. వీరితో పాటు మేడూరుకు చెందిన నాగభూషణం(54) ఓటుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. పెడనలో అత్యధికంగా 87.72% పోలింగ్ నమోదైంది. విజయవాడ వెస్ట్‌లో అత్యల్పంగా 68.55% మంది ఓటేశారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి.
కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. ఓ వ్యక్తి ఏకంగా ఐసీయూ నుంచి వచ్చి ఓటేశారు. విజయవాడకు చెందిన గోవాడ వెంకటశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న పోలింగ్ డే కాగా, విజయవాడ సెంట్రల్‌లోని 131వ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లయోలా కళాశాల పోలింగ్ బూత్ వద్ద సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలకు చెందిన వ్యక్తులు ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజ్యాంగం పౌరులకు అందజేసిన ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.