Krishna

News May 13, 2024

విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

image

సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, ప్రశాంతి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పౌరులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 13, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు సోమవారం సాయంత్రం ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ట్రైన్ నం.07098 సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకొని రేపు ఉదయం 8.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు కృష్ణా కెనాల్, సత్తెనపల్లి, గుంటూరుతో పాటు ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.  

News May 13, 2024

కంకిపాడులో ఓటు వేసిన సినీ నటి శ్రీరెడ్డి

image

కృష్ణా జిల్లా కంకిపాడులోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో, సోమవారం సినీ నటి శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పంచాయతీ బూత్‌లో ఓటింగ్ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మళ్లీ మంచి ప్రభుత్వం ఏర్పడుతోందని తెలిపారు.

News May 13, 2024

మైలవరం మండలంలో వైసీపీ నేతపై దాడి

image

మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద <<13238232>>ఉధృత వాతావరణం<<>> చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావుపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. టీడీపీ నేత శ్యామ్ కుర్చీతో దాడి చేయటంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలు అయినట్లు వైసీపీ నేతలు తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

News May 13, 2024

మచిలీపట్నం 144వ నంబర్ పోలింగ్ బూత్ EVMలో సాంకేతిక లోపం

image

మచిలీపట్నం 39వ డివిజన్ పరిధిలోని 144వ నంబర్ పోలింగ్ బూత్‌లో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన EVMలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. మాక్ పోల్‌లో EVM స్ట్రక్ అయింది. అధికారులు అప్పటికప్పుడు సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు.

News May 13, 2024

కృష్ణా జిల్లా ఎన్నికల సంగ్రామంలో 94 మంది

image

నేడు జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణా జిల్లా నుంచి 94 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీ పడుతుండగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీ పడుతున్నారు. గన్నవరంలో 12, గుడివాడలో 12, పెడనలో 10, మచిలీపట్నంలో 10, అవనిగడ్డలో 12, పామర్రులో 08, పెనమలూరులో 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ వైసీపీ, కూటమి (టీడీపీ+జనసేన) అభ్యర్థుల మధ్యే నెలకొంది.

News May 13, 2024

కృష్ణా జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

కృష్ణా జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

విజ‌య‌వాడ: హ‌రిత పోలింగ్ కేంద్రాన్ని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్

image

ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో హ‌రిత పోలింగ్ కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ఓట‌ర్ల‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనూ ప్ర‌త్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

విజయవాడ: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

image

విజయవాడలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొసనం పూజిత ఆమె భర్త వెంకటేశ్వరరావు మధ్య ఇటీవల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పూజిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . భర్త వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News May 12, 2024

అక్కడ కేంద్ర బలగాలు మోహరించండి: బీజేపీ

image

ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్ బూత్‌లలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, ఆ నియోజకవర్గాలలో వెంటనే కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని బీజేపీ కోరింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషనర్ ముకేశ్ మీనా, డీజీపీ హరీష్ గుప్తాలను ఈ రోజు కలిసిన బీజేపీ నేతలు కిలారి దిలీప్, సాదినేని యామిని శర్మ వారికి వినతి పత్రం అందజేశారు.