India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెడన-మచిలీపట్నం బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తోటమూల సెంటర్ నుంచి బైపాస్ రోడ్డులో AP39 TU 3126 నెంబర్ గల TVSపై మచిలీపట్నం వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్‌కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని ‘మాస్టర్ ఆఫ్ లాస్’ కోర్సు(LLM) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2022 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15, 16, 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో కొణకంచిలో విషాదం అలముకుంది.
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నెల 9 నుంచి 18 వరకు, వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు సోమవారం తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ దర్శనానికి ఉదయం 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తారన్నారు. ఉదయం 8.15 గంటలకు లక్ష్మీగణపతి మందిరం వద్ద వసంత నవరాత్రోత్సవాలు కలశస్థాపన, అనంతరం దుర్గమ్మకు పుష్పార్చన ప్రారంభిస్తారన్నారు.
విజయవాడ నగరంలో తిరిగే టిప్పర్ వాహనాల యజమానులతో పోలీస్ అధికారులు సోమవారం KS వ్యాస్ భవనంలో సమావేశమయ్యారు. గ్రావెల్ మొదలైన మెటీరియల్‌ను రవాణా చేసే టిప్పర్లు, కనకదుర్గ వారధి మీదుగా వారధి వైపునకు అనుమతించబడవని పోలీసులు తెలిపారు. టిప్పర్లు గొల్లపూడి వై జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లాలన్నారు. టిప్పర్లపై టార్పాలిన్ కప్పి మెటీరియల్ రవాణా చేయాలని పోలీసులు టిప్పర్ల యజమానులను ఆదేశించారు.
విజయవాడ రైల్వే డివిజన్ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.4029.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డివిజన్ ఏర్పడ్డ అనంతరం సరుకు రవాణాలో ఇదే అత్యధిక ఆదాయమని డివిజన్ అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార పదార్థాలు, స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకులను డివిజన్ నుంచి ఎక్కువగా రవాణా చేశామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
అవనిగడ్డలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. ప్రస్తుతం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేడు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జనసేనలోకి వెళ్లడంతో టీడీపీ పగ్గాలు చేపట్టేది ఎవరో అనే చర్చ మొదలైంది. టీడీపీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
పెనమలూరు వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ మంత్రి పదవిలో ఉంటూ ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2019 ఎన్నికలు అప్పటి మంత్రులైన కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాకు చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. 2019లో పెడన నుంచి గెలిచిన మంత్రి జోగిని సైతం సీఎం జగన్ పెనమలూరుకు బదిలీ చేయగా, టీడీపీ తమ అభ్యర్థిగా పెనమలూరులో బోడె ప్రసాద్‌ను నిలబెట్టింది. ఇక్కడ జోగి విజయం సాధిస్తారా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
వివాహేతర సంబంధం విషయమై హోంగార్డ్‌పై దాడి చేసిన యువకుడు, మహిళపై అజిత్‌సింగ్‌నగర్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. న్యూరాజేశ్వరిపేటకు చెందిన రవికుమార్(46)విజయవాడలో హోంగార్డ్. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటూ.. 18ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా సదరు మహిళ మరో యువకుడితో తిరగడం చూసిన రవి మందలించాడు. దీంతో ఆ మహిళ, యువకుడు రవిపై దాడి చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.