Krishna

News August 20, 2024

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పొడిగింపు

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బయలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు బెయిల్ పొడగిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో ఆయన ఏ72గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేశారు. వల్లభనేని వంశీకి కాస్త ఊరట లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 20, 2024

ఆ లోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు: మంత్రి కొలుసు

image

మార్చిలోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు అవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కంకిపాడులో గృహ నిర్మాణ సామగ్రి, నిల్వ గోదాంను ఆయన సందర్శించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News August 20, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాల కలవరం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, అతిసార కేసుల వివరాలను కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల DMHOలు ఎం.సుహాసినీ, జి.గీతాబాయి వివరించారు. జూన్, జులై నెలల్లో మలేరియా, డెంగీ- 300,టైఫాయిడ్-800+, అతిసారం కేసులు 208 నమోదయ్యాయన్నారు. విషజ్వరాలు నిర్ధారించిన ప్రాంతాల్లో 50 మీటర్ల పరిధిలో అందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 20, 2024

వీరులపాడు: పిడుగుపడి ఇద్దరి మృతి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. కుటుంబీకుల వివరాల మేరకు గంపలగూడెంలోని పెనుగొలనుకు చెందిన వెంకటేశ్వరరావు(26) సోమవారం పొలం దున్నేందుకు వెళ్లాడు. వర్షం పడడంతో చెట్టుకిందికి వెళ్లాడు. ఆసమయంలో పిడుగుపడి మృతి చెందాడు. అలాగే దొడ్డదేవర పాడులో వెంకటరమణ(17) పొలంలో పనులు చేస్తుండాగా సమీపంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 20, 2024

NTR: బాలికతో అసభ్య ప్రవర్తన.. మారుటి తండ్రికి 7ఏళ్లు జైలు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన దన్నే ఆనందరాజుకు ఏడేళ్లు జైలు, జరిమానా పడింది. విజయవాడలోని న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఆనందరాజు.. భర్తతో వేరైన ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. తల్లి ఇంట్లో లేనప్పుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. మందలించినా తీరు మారకపోవడంతో 2018లో అజిత్ సింగ్ నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు జైలు, రూ.10 వేలు జరిమానా విధించింది.

News August 20, 2024

కృష్ణా జిల్లాలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. విజయవాడ, గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో నెల కిందట వంద రూపాయలకే 5 కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. ప్రస్తుతం ఉల్లి కిలో కొనాలంటే రూ.60 పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల వ్యవధిలోనే భారీగా ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ధరలు పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. 

News August 19, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* గుడివాడలో అర్ధరాత్రి ఉద్రిక్తత
* కృష్ణా జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులు
* విజయవాడలో ఇంటర్ విద్యార్థి సూసైడ్
* కృష్ణా జిల్లాలో డాక్టర్‌పై పేషెంట్ దాడి
* మచిలీపట్నంలోని ఇంట్లో చోరీ
* తిరువూరులో బాలికపై అత్యాచారం
* కృష్ణా: అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

News August 19, 2024

గుడివాడ: అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

image

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు.

News August 19, 2024

దస్త్రాలను ధగ్ధం చేసినా పాడుచేసిన క్రిమినల్ చర్యలు: సృజన

image

ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలో తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దస్త్రాలను ధగ్ధం చేసినా, పాడుచేసినా సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

News August 19, 2024

అనురాగానికి ప్రతీక రక్షాబంధన్: మంత్రి కొల్లు

image

మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా తమ కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.