Krishna

News August 19, 2024

ఫొటోగ్రఫీ డే.. కెమెరామేన్‌ అవతారమెత్తిన సీఎం

image

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా ఫొటోలు క్లిక్ మనిపించారు. నాణ్యమైన సేవలతో ఫొటోగ్రఫీ రంగం బాగుండాలని సీఎం ఆకాంక్షించారు.

News August 19, 2024

విజయవాడలో ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన వాంబేకాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వాంబేకాలనీ బీ-బ్లాక్‌కు చెందిన షేక్ కేశవ ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకున్నాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా వేలాడుతున్నాడు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News August 19, 2024

కృష్ణా జిల్లాలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్హులైన పేదలకు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయనుంది. ఇప్పటికే ఉన్న పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. పండగలకు రేషన్‌ కార్డుదారులందరికీ మళ్లీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు రానున్నాయి.

News August 18, 2024

పెనమలూరులో పేకాట శిబిరంపై దాడి

image

పెనమలూరు మండలం పోరంకి నారాయణపురం కాలనీలో పేకాట శిబిరంపై CCS పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పేకాట డెన్ నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సుమారు 26 మంది అరెస్ట్ చేసి రూ.3లక్షలపైగా నగదు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. కొన్ని నెలలుగా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నా పోలీసులు దాడులు చేయకపోవడం గమనార్హం.

News August 18, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్నందున నం.13351 ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ సెప్టెంబర్ 2 నుంచి 29 వరకు తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.

News August 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 19న ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సికింద్రాబాద్-నరసాపురం(నం.07176) & సికింద్రాబాద్-కాకినాడ టౌన్(నం.07188), 20న సికింద్రాబాద్- కాకినాడ టౌన్(నం.07178) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఈ రైళ్లు విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News August 18, 2024

కృష్ణా: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.

News August 18, 2024

తగిన మూల్యం చెల్లించక తప్పదు: మాజీ మంత్రి దేవినేని 

image

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దహనం ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. చేసిన పాపాల సాక్ష్యాలను మాయం చేసేందుకు ఈ విధంగా దస్త్రాలకు నిప్పు పెడుతున్నారని ఉమ ఆరోపించారు. ఫైళ్ల దహనంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేస్తుందని, సాక్ష్యాలు బూడిద చేసి తప్పించుకోవాలనుకునే వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఉమ Xలో పోస్ట్ చేశారు.

News August 18, 2024

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం

image

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల పరిధిలోని పాలకాయతిప్ప సమీపంలో సముద్రంతీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఐదుగురు యువకులు స్నానానికి వెళ్లారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొ వ్యక్తి గల్లంతలయ్యాడు. మైరెన్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News August 18, 2024

విజయవాడ మీదుగా వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా మధురై- ముజఫర్‌పూర్ (నం.06114) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 7.05 గంటలకు మధురైలో బయలుదేరే ఈ ట్రైన్ 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, 21వ తేదీన 2.45 గంటలకు ముజఫర్‌పూర్ చేరుకుంటుందన్నారు.