India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించి విడుదల చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాలో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేయగా అందులో 2,713 మంది బాలికలు, 1,327 మంది బాలురు ఉన్నారు. సీట్లు సాధించిన బాలికల శాతం 67.15 కాగా, బాలురు శాతం 32.85 మాత్రమే. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,757 మందికి సీట్లు రాగా, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 283 మందికి సీట్లు వచ్చాయి.
విజయవాడ నూతన <<13611371>>పోలీస్ కమిషనర్‌గా<<>> SV రాజశేఖర్ బాబుని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజశేఖర్ బాబు గుంటూరు రూరల్ ఎస్పీగా, లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డీజీగా కూడా పని చేశారు. రాజశేఖర్ 2006 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి. ఈ నియామక ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పెదపులిపాకలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో OSD రామారావు ఇంట్లో గురువారం పోలీసులు సోదాలు జరిపారు. OSD రామారావు ఆదేశాలతోనే కార్యాలయం నుంచి ఫైల్స్ బయటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు.
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా వెళ్లే హైదరాబాద్- షాలిమార్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18046 రైలును ఆగస్టు 3-11 వరకు, నం.18045 ట్రైన్‌ను ఆగస్టు 2-10 వరకు విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్‌లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్‌ను మెటా బ్లాక్ చేసింది. తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీకి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని కోరారు.
విజయవాడలోని నాలుగో డివిజన్‌లో MP చిన్నీ గురువారం మధ్యాహ్నం పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. నోవోటెల్ వైపు సర్వీస్ రోడ్ పరిశీలించి దానిని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నగర పాలక సంస్థలు 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు నిధులు మిగలాలని ఆ రోజు చేపట్టిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చింది. అదే సీసీ రోడ్లు నిర్మించడానికి కారణమైందని అన్నారు.
రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలను ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కేసీరెడ్డి ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 22, 23 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులు 70 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఇప్పటికే 15 మందిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
రాష్ట్రంలో సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్మును వైసీపీ నాయకులు దోచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో వైసీపీ నేతలు భారీ అవినీతి దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. జిల్లాలో రూ.300 కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. పేదలకు స్థలాల కోసం భూసేకరణలో ఇష్టానుసారం రేట్లు పెంచి వైసీపీ నాయకులు పంచుకున్నారని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.