India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ విధ్వంస పాలనలో వ్యవస్థలు కుదేలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాలుగా గాడిలో పెట్టే పని మొదలుపెట్టారని ఉమ వ్యాఖ్యానించారు. సంపద సృష్టి ద్వారా టీడీపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు చేపడుతోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్‌లైన్‌లో సేల్స్ ఫోర్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలని, అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం- నాగర్‌సోల్(నం.07169) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 15న మధ్యాహ్నం 12.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మండలంలోని బుధవాడ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బానోతు స్వామి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్‌లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఈ కమిటీలో 6 పోస్టులకి ఎన్నిక జరగగా 6 స్థానాలలోనూ YCP కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కాగా వీఎంసీలో వైసీపీకి 49 కార్పొరేటర్ల బలముండగా టీడీపీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు 14 మంది ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు వైసీపీ వశమయ్యాయి.
విజయవాడ నుంచి బిట్రగుంట మధ్య ప్రయాణించే మెమూ ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా, కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 29 నుంచి ఆగస్టు 2 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. బాధితుడి ఫిర్యాదుపై హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
జగ్గయ్యపేట పరిధి బూదవాడలోని సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన ఐదుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి, విషమంగా ఉందని DMHO సుహాసిని తెలిపారు. తీవ్రగాయాలైన అర్జున్, గుగులోతు స్వామి, గోపి, సైదా, శ్రీమన్నారాయణలకు ప్రస్తుతం చికిత్స అందుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో 10 మంది కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు మరికొద్దిసేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి చేరుకోవటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిల్వలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరికాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.