India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ సంచాలకులు కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నం.8 అశోక్‌నగర్, విజయవాడలోని స్టడీ సర్కిల్లో నిర్ణీత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30తో దరఖాస్తు గడువు ముగియగా తాజాగా జులై 10 వరకు పెంచామని ఆమె చెప్పారు.
ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.
పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్ సోమవారం 43 మందికి పింఛన్లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి <<13500067>>మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు.<<>> దాదాపు 9 నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.
అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో జూన్ 28న మరణించిన కరిష్మా(17) పోస్టుమార్టం రిపోర్ట్ తాజాగా పోలీసులకు చేరింది. మృతురాలు అనుమానాస్పద స్థితిలో మరణించిన నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. కాగా మృతురాలి శరీర భాగాలను పరీక్షల నిమిత్తం హిస్టో పాథాలజీ పరీక్షలకు పంపామని, కరిష్మా మరణించిన సమయంపై స్పష్టత వచ్చేందుకు నిపుణుల నుంచి పూర్తిస్థాయి నివేదిక రావాలని పోలీసులు చెబుతున్నారు.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రూ.82 లక్షలు చోరికి గురయ్యాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు. శనివారం సాయంత్రం కళాశాలలో భద్రపరిచిన నగదు చోరికి గురైన విషయాన్ని సోమవారం కళాశాలకు వచ్చిన సిబ్బంది ఆలస్యంగా గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ చోరీ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో ఆపరేషన్స్ జులై 1 నుంచి పునఃప్రారంభం అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కార్గో రవాణా ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కార్గో కార్యకలాపాల ద్వారా విజయవాడ విమానాశ్రయ ఆదాయం పెరగనుందని రామ్మోహన్ Xలో పోస్ట్ చేశారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీ-ఫార్మసీ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్సిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.