Krishna

News March 22, 2024

చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగ్గయ్యపేట వాసి మృతి

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.

News March 22, 2024

విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

image

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయంపై దాడి

image

గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయ తలుపులు పగుల గొట్టి, కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

కృష్ణా: జడ్పీ సీఈఓ జ్యోతిబసు బదిలీ

image

జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీర్ల జ్యోతిబసు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు జ్యోతి బసును బదిలీ చేశారు.

News March 22, 2024

కోడూరు: విధుల నుంచి వాలంటీర్ తొలగింపు

image

కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.

News March 22, 2024

ఉయ్యూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఉయ్యూరులో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఉయ్యూరు టౌన్ సిఐ హబీబ్ బాషా తెలిపిన వివరాలు మేరకు.. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. ముగ్గురు మహిళలు, ఓ విటుడుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉయ్యూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

News March 22, 2024

కాన్పులు చేయని ఆరోగ్య కేంద్రాలపై చర్యలు: డీఎంహెచ్‌వో

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం.సుహాసిని గంపలగూడెంలోని చౌటపల్లి, ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు నిర్వహణ తీరు, లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. పి.హెచ్.సిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు పర్యవేక్షించారు. పీహెచ్సీలో కాన్పులు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 21, 2024

విజయవాడ: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే న్యూస్

image

రామ్ చరణ్, కాజల్, అమలాపాల్ నటించిన ‘నాయక్'(2013) సినిమా ఈ నెల 23, 24వ తేదీల్లో రీరిలీజ్ అవ్వనుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ G3 థియేటర్‌లో విడుదల కానుంది.’నాయక్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమాలోని పాటలు, సీన్స్ పోస్ట్ చేస్తున్నారు.

News March 21, 2024

విజయవాడ వెస్ట్ టికెట్‌పై ముదిరిన వివాదం

image

విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.

News March 21, 2024

ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

image

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.