India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగు తమ్ముళ్లు నేరుగా కలుసుకునే సదవకాశాన్ని కల్పించినట్లు పామర్రు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఎందుకు సీఎం చంద్రబాబును కలవాలనుకుంటున్నారో సహేతుకమైన కారణాన్ని 73062 99999 సెల్ నంబర్‌కు తెలియజేస్తే, ఎప్పుడు వచ్చి కలవాలో చెబుతామంది. కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులకు చేరువుగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
టీడీపీ ప్రభుత్వం రాకతో రాజధాని అమరావతి పునర్నిర్మాణం పురుడు పోసుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. ఐదేళ్లపాటు అమరావతిపై జగన్ సాగించిన విధ్వంసానికి తెరపడిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సరిచేసి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం ముందుకు సాగుతుందని ఉమ Xలో పోస్ట్ చేశారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సత్రాగచ్చి (SRC), సికింద్రాబాద్ (SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07222 SRC- SC ట్రైన్‌ను జూలై 3 నుంచి సెప్టెంబర్ 29 వరకు, నం. 07221 SC- SRC ట్రైన్‌ను జూలై 2 నుంచి సెప్టెంబర్ 28 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.
మండలంలోని గౌరవరం గ్రామంలో ఆదివారం యాకోబు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యాకోబు మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
రామలింగేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు పటమట ఎస్సై శాతకర్ణి తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మృతుడి వయసు సుమారు 50సం. వరకు ఉంటుందని చెప్పారు. మృతిని ఆచూకీ తెలిసిన ఎడల పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
జులై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీకి జిల్లాలో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు గాను కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 2.42లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని రేపే 100% పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఉదయం 6 నుంచే పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇందులో నిర్లక్ష్యం జరిగితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం లేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సీపీ రామకృష్ణ తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మొత్తం 92 రోజుల పాటు సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. 30 పోలీస్ యాక్ట్ అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసు కుంటామని సీపీ స్పష్టం చేశారు.
గన్నవరం విమానాశ్రయంలో రేపటి నుంచి కార్గో సేవలు పునఃప్రారంభం కానున్నట్లు విమానశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ సేవలకు ముందడుగు పడినప్పటికీ కరోనా వల్ల నిలిచిపోయిందన్నారు. తాజాగా కార్గో సేవలను ఒమెగా ఎంటర్ ప్రైజెస్ దక్కించుకుంది. చేప, రొయ్యలతో పాటు, పాలు, పూలు, పండ్లు, మిర్చి, తదితరాలను దేశంలోని ఏప్రాంతానికైనా గంటల వ్యవధిలో చేర్చేందుకు ఈ సర్వీస్ ఉపయోగపడుతుందన్నారు.
మండలంలోని తుర్లపాడులో శనివారం తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. SI ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యానందం, సత్యంబాబులు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికీ తల్లికి గృహనిర్మాణ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నపై చేయి చేసుకోగా అన్న గొడ్డలితో తమ్ముడిపై మెడపై నరికాడు. పోలీసులు సత్యానందాన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. క్షతగాత్రుడు విజయవాడలో చికిత్సపొందులతున్నాడు.
Sorry, no posts matched your criteria.