India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని దింటి మెరక ప్రధాన పంట కాలువ గట్టుపై ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. కోడూరు ఎస్సై శిరీష కాలువ గట్టుపై నివసిస్తున్న యానాదుల గుడిసెల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ విషయంపై అవనిగడ్డ సీఐ త్రినాథ్ మృతుడి వివరాలు, మరణానికి గల కారణలపై విచారణ జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల పెన్షన్లను మే 1వ తేదీన పెన్షన్ దారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని వారికి సచివాలయ ఉద్యోగులు మే 1 నుంచి 5వ తేదీ లోపు వారి ఇళ్లకు వెళ్లి ఇస్తారని అన్నారు. జిల్లాలో మొత్తం 2,43,400 మంది పెన్షన్ దారులకు రూ.71.75కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పెన్షన్ దారుల్లో 75% మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయన్నారు.
తాడేపల్లి నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి వస్తుండగా కేసరపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌కి కుక్క అడ్డం పడింది. ఘటనలో కుక్కకు గాయాలు అవ్వడంతో సీఎం పర్సనల్ సెక్యూరిటీ కుక్కని హాస్పిటల్ తీసుకెళ్లమని గన్నవరం పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భద్రంగా ఉంచారు. పూర్తిగా నయం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని సీఎం సెక్యూరిటీ ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 17,04,007 కు చేరుకుంది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య ఇలా..!
తిరువూరు: 2,07,190
విజయవాడ పశ్చిమ: 2,55,963
విజయవాడ సెంట్రల్: 2,77,724
విజయవాడ తూర్పు: 2,70,624
మైలవరం: 2,81,732
నందిగామ: 2,05,480
జగ్గయ్యపేట:2,05, 364
జగ్గయ్యపేట అసెంబ్లీ జై భీమ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కరిసే మధు వైసీపీలో చేరారు. తొర్రగుంటపాలెంలో శనివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో MLA అభ్యర్థి సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు ఉదయభాను మాత్రమే అని అన్నారు.
కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాకు అదనంగా సప్లమెంటరీ ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లు ఉన్నారు. గత జనవరిలో 15,18,255 మంది ఓటర్లతో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే జిల్లాలో 21,205 మంది ఓటర్లు పెరిగారు. వీరంతా మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
తాడిగడపలో శనివారం దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చే సమయంలో భార్య షకీలా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో హత్య చేసినట్లు సమాచారం. శ్రీనివాసరావును షకీలా రెండో వివాహం చేసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఇరువురికి పరిచయం ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పెనమలూరు సీఐ రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నపోతేపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుప్పాల గణేశ్ మట్టి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం పోతేపల్లి నుంచి మట్టి లోడ్ చేసుకుని వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎన్టీఆర్ జిల్లాలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంత వివరాలను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఈనెల 7వ తేదీన 44.1°C ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇదే 26.04.2024 వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అని తెలియజేశారు.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 332 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో 122 సెట్ల నామినేషన్లు అదనంగా వచ్చాయి.
Sorry, no posts matched your criteria.