India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06087 TEN- SHM ట్రైన్‌ను జూలై 18, 25 తేదీలలో నం.06088 SHM- TEN ట్రైన్‌ను జూలై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.
ఏపీ పెన్షన్‌దారుల సంఘ సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ మేరకు పెన్షన్‌దారుల సంఘ ప్రతినిధులు త్వరలో ప్రభుత్వం ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లకు రూ.2 లక్షల విరాళం సీఎంకు అందించారు. ఈ సందర్భంగా వారు రూ.2 లక్షల చెక్కును చంద్రబాబుకు సంఘ సభ్యులు అందజేయగా, పెన్షన్‌దారుల సంఘానికి సీఎం అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ (శాసనసభ, శాసనమండలి) సెక్రటరీ జనరల్‌గా సుప్రీంకోర్ట్ మాజీ రిజిస్ట్రార్ సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న డా.PPK రామానుజాచార్యులు రాజీనామా చేయడంతో ప్రసన్నకుమార్ తాజాగా సెక్రటరీ జనరల్‌గా నియామకమయ్యారు. ప్రసన్నకుమార్ గతంలో ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
కలెక్టర్ DK బాలాజీ మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సమావేశ మందిరంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశమై మాతా శిశు మరణాల రేటు తగ్గేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, దోమల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేసుకోవాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వారం ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించాలన్నారు.
పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం ఆయన ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో పామాయిల్ అత్యధికంగా సాగవుతుందని, గత సంవత్సరం నుంచి అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సైతం పామాయిల్ సాగుతున్నట్లుగా గుర్తించామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
కృష్ణా జిల్లాలో 36.2 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 88.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా బాపులపాడు మండలంలో 1.6 మి.మీలు వర్షపాతం నమోదైందని వివరించారు.
అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జులై 31 వరకు పెంచినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జూలై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
Sorry, no posts matched your criteria.