India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్లో గురువారం టీడీపీ ఎంపీలందరూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం అందించారు. పార్లమెంట్ భవన్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో టీడీపీకి కేటాయించిన కార్యాలయం చిన్నదిగా ఉండటంతో కొంచెం విశాలమైన స్థలం ఉన్న కార్యాలయం కేటాయించాలని కోరారు. టీడీపీ పార్లమెంట్ పక్షనేత లావు కృష్ణదేవరాయ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలందరూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలని కలెక్టర్ సృజన అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా నూతన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సృజనను ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, తదితర నటులు, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీదత్ తదితరులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
మంగళగిరి CI శ్రీనివాసరావును బదిలీ చేస్తూ రేంజి ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోని ఆఫీసులో పవన్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ఆయన షూతో లోపలికి వెళ్లినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది ఆగాలని చెప్పినా దురుసుగా ప్రవర్తించి లోపలికి వెళ్లారని, అందుకే సస్పెండ్ చేసినట్లు కార్యాలయ సిబ్బంది చెప్పారు. ఈయన స్థానంలో బుధవారం <<13513403>>CI వినోద్<<>> బాధ్యతలు స్వీకరించారు.
అనుమోలు గార్డెన్స్‌లో జరిగే దివంగత రామోజీరావు సంస్మరణ సభకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. A1 గ్యాలరీ ప్రముఖుల వాహనాలు సభాప్రాంగణం సమీపంలోని సిద్దార్థ కాలేజీ, చైతన్య మహిళా కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. B1 గ్యాలరీకి చెందినవారి వాహనాలు కృష్ణవేణి స్కూల్స్ ఆవరణలో, ఇతర వాహనాలు సిద్దార్థ కళాశాల ఆవరణలో పార్క్ చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది.
విజయవాడలోని పాయకాపురం వాంబేకాలనీలో ఉండే ఓ యువతి(22) డిగ్రీ చదివి, ఓ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి తరచూ మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తిస్తూ, కోరిక తీర్చాలని వేధించేవాడు. సోమవారం మరోసారి అతను మద్యం తాగొచ్చి, బట్టలు తీసేసి అసభ్యంగా ప్రవర్తించి, యువతితో గొడవ పడి ఇంటినుంచి వెళ్లిపోమని బెదిరించాడు. మంగళవారం ఇదే విషయంతో కొట్టడానికి ప్రయత్నించగా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విజయవాడలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అవార్డ్ దక్కింది. 2023-24లో రికార్డ్ స్థాయిలో 3.75లక్షల మందికి పాస్‌పోర్టులు జారీ చేసినందుకు గానూ అధికారి శివహర్ష 24న అవార్డు అందుకున్నారు. దేశంలోని 37 కార్యాలయాల్లో విజయవాడే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం విజయవాడలో 600 మంది సేవలు అందిస్తున్నట్లు.. త్వరలోనే రోజుకు 1200 మందికి సేవలు విస్తరిస్తామని అధికారులు చెప్పారు.
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించనున్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక, 10వేల మంది కూర్చునేలా మూడు భారీ టెంట్లను నిర్మించింది. సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ఠవ్, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు హాజరుకానున్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన 5, 6వ సెమిస్టర్ పరీక్షల(అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ) షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జులై 25 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా జులై 6లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examinationsection చెక్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.