India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంకిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి విషయమై ముగ్గురు యువకులు ఘర్షణ పడినట్లు తెలిపారు. వణుకూరు, ఉయ్యూరు గ్రామాలకు చెందిన యువకులు బీరు బాటిళ్లతో జాతీయ రహదారి సమీపంలో దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతోందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. చెక్‌పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా ఆయన ఆదివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు.
ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో మహిళ మేకలను మేతకు తోలుకు వెళుతుండగా, ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వాసు తెలిపారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ వాసు స్పష్టం చేస్తున్నారు.
స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ-విజిల్ ద్వారా 634 ఫిర్యాదులు పరిశీలించి పరిష్కరించినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ తదితర మార్గాల ద్వారా మొత్తం 1, 635 ఫిర్యాదులు రాగా 1, 609 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు ఆస్తి వివరాలు చూస్తే సామాన్యుడే అని అన్నట్లుగా అనిపిస్తుంది. కెనరా బ్యాంకులో ఉన్న అకౌంట్లో రూ.1000, మైలవరం మండల పుల్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూ.9,823 ఉన్నట్లు చూపించారు. తన పేరుతో రూ.73,531 విలువైన 2016 మోడల్ బైకు, రూ.55,200 విలువైన 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంగా రూ.50 వేలు ఉన్నట్లు పొందుపరిచారు.
ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు.
ఆర్థిక ఇబ్బందులతో నవ వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబర్ 24లో మేరీ గ్రేసీ, వెంకట్ నివాసం ఉంటున్నారు. నెల రోజుల కిందటే గ్రేసీ, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16)ను లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. శనివారం కూడా కళ్యాణ్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కబేళాకు సెలవని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
Sorry, no posts matched your criteria.