India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 2 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-ఏలూరు నుంచి కాక రాయనపాడు-గుడివాడ-భీమవరం మీదుగా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
మచిలీపట్నం, యశ్వంత్‌పూర్ మధ్య ప్రయాణించే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17211/17212
కొండవీడు ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17211 ట్రైన్‌ను నవంబర్ 11 నుంచి, 17212 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.
కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా గంగాధర్ రావు నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అద్నాన్ నయీం అస్మిని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలకు తోడు మాగాణి పంటల సాగుకు, వరి నారుమళ్లు పోయటానికి రైతులు సిద్దమవుతున్న తరుణంలో వర్షాల రాక ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలో కురిసే ఈ వానలతో విత్తనాలు మొలకెత్తి పంటలు ఏపుగా పెరిగి దిగుబడి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న అధిరాజ్ సింగ్ రాణాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా అధిరాజ్ సింగ్ రాణాని నంద్యాల జిల్లా ఎస్పీగా నియమిస్తూ.. సీఎస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఎస్పీ అద్నాన్ నయీంని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ.. డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నూతన ఎస్పీగా ఆర్ గంగాధరరావును నియమించారు. గంగాధరరావు ప్రస్తుతం సీఐడీ ఎస్పీగా ఉన్నారు.
బాపులపాడు మండలం మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీ యూనిట్‌లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమవడంతో ఆ కంపెనీ పనులు ప్రారంభించేందుకు అంగీకరించిందని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
వినియోగదారుల సౌకర్యార్థం నేడు, రేపు కూడా ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు పని చేస్తాయని APCPDCL ఎస్ఈ మురళీమోహన్ తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా APCPDCL కస్టమర్ యాప్‌లో సైతం విద్యుత్ బిల్ చెల్లించవచ్చని సూచించారు.
విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి బాపులపాడు మం. వీరవల్లి వద్ద మొరాయించింది. బస్సుకు మరమ్మతు చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరారవ్వడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో వీరవల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించారు. బస్ యాజమాన్యం టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంతో ఇతర బస్సుల్లో వెళ్లిపోయారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2020లో ఆలయ భద్రతపై ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు అమలు కాకపోవడంతో తాజాగా అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు ఆడిట్ నిర్వాహకులు ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించారు. మెటల్ డిటెక్టర్లు, భద్రతా సిబ్బంది పెంపు, వారికి శిక్షణ తదితర అంశాలను వారు తమ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.