Krishna

News June 28, 2024

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజీనామా

image

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లా జ్ఞానమణి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాల మేరకు వైస్ ఛాన్స్‌లర్ పదవిలో ఉన్న జ్ఞానమణి రాజీనామా చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా 2023 సంవత్సరం ద్వితీయార్థంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా జ్ఞానమణి నియామకమయ్యారు.

News June 28, 2024

దేవుడి పేరుతో దందాలు చేశారు: ఎమ్మెల్యే బొండా

image

గత ప్రభుత్వ పాలనలో దేవుడి పేరుతో దందాలు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించాలని రాసిన సిఫారసు లేఖతో ఈ దందా బైటపడిందన్నారు. భక్తుల సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోని వైసీపీ నాయకులు దేవుడి పేరు చెప్పి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఉమ Xలో పోస్ట్ చేశారు.

News June 28, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఫార్మ్-డీ (ఐదో ఏడాది) కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 3, 5, 8 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 28, 2024

సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి: DMHO సుహాసిని

image

ప్రజలు ఇంటితో పాటు, పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. బయట ఆహారాలు తినకుండా, ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిదన్నారు.

News June 28, 2024

మచిలీపట్నం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని మచిలీపట్నంలో నిర్మిస్తున్న YCP కార్యాలయానికి బుధవారం నోటీసులిచ్చారు. YCP జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనం వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. 1000 చదరపు గజాల విస్తీర్ణం దాటిన భవనాలకు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని, అలా జరగనందునే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

News June 28, 2024

కృష్ణా: LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 27, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జూలై 4 నుంచి అక్టోబర్ 10వరకు ప్రతి మంగళవారం, నం.05951 SMVB- NTSK రైలును జూలై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News June 27, 2024

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన టీడీపీ ఎంపీలు

image

పార్లమెంట్లో గురువారం టీడీపీ ఎంపీలందరూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం అందించారు. పార్లమెంట్ భవన్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో టీడీపీకి కేటాయించిన కార్యాలయం చిన్నదిగా ఉండటంతో కొంచెం విశాలమైన స్థలం ఉన్న కార్యాలయం కేటాయించాలని కోరారు. టీడీపీ పార్లమెంట్ పక్షనేత లావు కృష్ణదేవరాయ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలందరూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

News June 27, 2024

ప్ర‌జ‌ల‌కు పారదర్శకమైన సేవాలందించాలి: సృజ‌న

image

అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్ర‌జ‌ల‌కు పారదర్శకమైన సేవలందించాలని క‌లెక్ట‌ర్ సృజ‌న అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సృజ‌న‌ను ఏపీ ఎన్‌జీవో అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షుడు విద్యాసాగ‌ర్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో స‌హ‌క‌రించార‌న్నారు.

News June 27, 2024

ప్రభాస్ ‘కల్కి’ మూవీ టీంకు మంత్రి లోకేశ్ కంగ్రాట్స్

image

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, తదితర నటులు, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీదత్ తదితరులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.