Krishna

News June 25, 2024

జగన్‌ది కిమ్‌ను తలదన్నే వ్యవహారశైలి: దేవినేని ఉమా

image

మాజీ సీఎం జగన్‌ది కిమ్‌ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్‌కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్‌ను ఆయన Xలో ప్రశ్నించారు.

News June 25, 2024

విజయవాడ: నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని వారు వెల్లడించారు.

News June 25, 2024

ఉంగుటూరు: తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఉంగుటూరు- ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంక్చర్ పడగా, టైరు మార్చేందుకు అటుగా వెళ్తున్న టాటా మ్యాజిక్ డైవర్ సాయం వచ్చాడు. ఈ క్రమంలో సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 25, 2024

కృష్ణా జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు AP పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 508 ఎస్టీటీలతో కలిపి మొత్తం 1213 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

జగ్గయ్యపేటలో డయేరియాకు కారణమిదే.!

image

జగ్గయ్యపేటలో డయేరియా కేసుల నమోదైన నేపథ్యంలో 26 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు NTR జిల్లా డీఎంహెచ్‌వో సుహాసిని చెప్పారు. క్లోరినేషన్ చేయని నీటిని తాగిన కారణంగానే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కొందరు హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్ర ఆహారం తీసుకున్నట్లు చెప్పారు. అతిసారం వ్యాపించిన ప్రాంతాల్లోని ప్రజలు కొన్నిరోజులు మాంసాహారం తినొద్దని సూచించినట్లు ఆమె వివరించారు.

News June 25, 2024

కృష్ణా: ఈ నెల 30తో ముగియనున్న గడువు

image

దూరవిద్యా విధానంలో MBA, పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్సిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్ వర్గాలు సూచించాయి.

News June 25, 2024

కృష్ణా: ఐదేళ్ల బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

image

నున్న ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడిని దుర్గారావు(20)కు పోక్సో కోర్టు సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలిపై యువకుడు అత్యాచారం చేసినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏప్రిల్ 6, 2019న నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేసు విచారణకు రాగా దుర్గారావు నేరం చేసినట్లు రుజువైంది. దీంతో రిమాండ్‌లో ఉన్న అతడికి శిక్ష ఖరారైంది. 

News June 24, 2024

కృష్ణా: రద్దైన రైళ్లను పునరుద్ధరించిన రైల్వే

image

ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండ్రుప్‌కర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.12805 విశాఖపట్నం- లింగంపల్లి, నం.12806 లింగంపల్లి- విశాఖపట్నం రైళ్లను రేపు మంగళవారం నుంచి యథావిధిగా నడుపుతామన్నారు.

News June 24, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కి నివేదించనున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కొల్లు రవీంద్ర, పార్థసారథి

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.