India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 22న మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా ఉంటుందన్నారు.
ప్రయాణికుల సౌలభ్యం కోసం విజయవాడ-గూడూరు విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12744 విజయవాడ-గూడూరు(జూన్ 20 నుండి 30వ తేదీ వరకు), నం.12743 గూడూరు-విజయవాడ(జూన్ 21 నుంచి జులై 1 వరకు) ట్రైన్లకు 3 సెకండ్ సిట్టింగ్ కోచ్లు(2S) అదనంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ ట్రైన్లకు ఆయా తేదీల్లో 3అదనపు కోచ్లు ఉంటాయన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో డీపీఈడీ(డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల అయింది. జూన్ 28, 29, జూలై 1, 2 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. ఫీజు వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నిన్న బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పవన్ 10 గంటలపాటు సమీక్షలు నిర్వహించినట్లు జనసేన తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.
రుషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిచారు. ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను జగన్ ఇళ్లు అన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని, ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. ఫలితాల అనంతరం వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాని, వాటికి తాము ఏమాత్రం భయపడమన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీటెక్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదల అయింది. జూలై 2, 4, 6, 8,10 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల అయింది. జూన్ 28, 29, జూలై 1, 2 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
మంత్రిగా వాసంశెట్టి సుభాష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ATVM) ఫెసిలిటేటర్స్ కొరకు విజయవాడ రైల్వే డివిజన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఉద్యోగ ప్రకటన కాదని గమనించాలని అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ATVM ఫెసిలిటేటర్స్కు ఎలాంటి పారితోషికం/వేతనం ఉండదని, వీరికి టికెట్ సేల్పై బోనస్ మాత్రమే ఉంటుందని వారు తెలిపారు. పూర్తి వివరాలకు https://scr.indianrailways.gov.in/ అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.