India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే అవనిగడ్డ MLA మండలి బుద్ధప్రసాద్కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం మాచవరం ఇన్స్పెక్టర్ గుణరామ్కు ఫోన్ చేశారు. ఓ యువతి అదృశ్యం కేసుపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెంకి చెందిన ఓ యువతి విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ అదృశ్యమయింది. బాలిక తల్లి మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేగవంతంగా బాలిక ఆచూకీ కనుగొనాలని సీపీ రామకృష్ణను కోరారు.
జర్నలిస్టుల ప్రమాద భీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని, సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కారం చేస్తామని మంత్రి కొలుసు పార్థ సారథి హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం తాడిగడపలోని మంత్రి కార్యాలయంలో పార్థసారథిని కలిశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీరావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా కలెక్టర్గా ఉన్న పి. సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా నియమించారు.
జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.
తమ చెల్లెల్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో బావపై బావమరుదులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఆదర్శనగర్కు చెందిన అబ్దుల్లా భార్య పుట్టింటికి వెళతానని అడుగగా పంపలేదు. ఈ విషయాన్ని తన అన్నలకు చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు శనివారం అర్ధరాత్రి బావ అబ్దుల్లాపై కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్లాను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మండల పరిధిలోని ఐతవరం గ్రామ శివారు సచివాలయం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఓ వ్యక్తి సైకిల్ మీద వెళుతుండగా.. గుర్తు తెలియనిది ఓ వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు నందిగామ స్టేషన్ను సమాచారం ఇవ్వాలని కోరారు.
కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిమిత్తం ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటలు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు.
కూరగాయలు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రైతు మార్కెట్లో కేజీ రూ.50గా విక్రయిస్తుండగా.. టమాటా ధర రిటైల్ మార్కెట్లో రూ.70 నుంచి రూ.90 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయలు పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ.44 ఉంటే, కాకరకాయ రూ.48, బెండ రూ.60, బీరకాయ రూ.55గా ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.