India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు తెలిపాయి. రిజల్ట్స్ కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణా జిల్లా నూజివీడులో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లికి చెందిన నరసింహారావు కుమార్తె వాసంతి(28)ని కాన్పు కోసం ఈనెల 12న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. డెలివరీ చేసేందుకు 13న ఆసుపత్రి సిబ్బంది వాసంతిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లగా ఆమె మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 16వ తేది ఆదివారం UPSC పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నగరంలోని 25పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో మెత్తం 11,112మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30నుంచి 11.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30నుంచి 4.30వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభంకానుంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ముంబయి నుంచి విజయవాడకు ఎయిరిండియా విమానం రానుంది. టికెట్ ప్రారంభ ధర రూ.5,600గా నిర్ణయించడంతో డిమాండ్ ఏర్పడింది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు ఈ సర్వీసు విజయవాడ నుంచి బయలుదేరుతోందని తెలిపారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు సికింద్రాబాద్- కాకినాడ టౌన్ (ట్రైన్ నెం. 07135) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ నెల 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ తర్వాతి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుందని, ఈ రైలు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్ సిద్ధమైనా, వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.
విజయవాడ మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.12503 బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు 15673 నెంబరు, నం.12504 అగర్తలా- బెంగుళూరు కంటోన్మెంట్ హమ్‌సఫర్ ట్రైన్‌కు 15674 నెంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
టీడీపీ ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ పార్టీ MLA కొలికపూడి శ్రీనివాస్ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. DSCకి ప్రిపేర్ అయ్యేవారికి తిరువూరులో ఉచిత కోచింగ్ ఇస్తామని ఆయన తాజాగా తన అధికారిక FB ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ శిక్షణకు రాష్ట్రంలో ఉండే ఎవ్వరైనా రావొచ్చని కొలికపూడి చెప్పారు. కాగా గతంలో కొలికపూడి తన KS రావు అకాడమీ ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ శాఖకు మంత్రిగా జిల్లాకు చెందిన దేవినేని ఉమ ఐదేళ్లపాటు పనిచేశారు. సమర్థుడైన నిమ్మల ఈ శాఖకు న్యాయం చేస్తారని, మంత్రిత్వ శాఖల కేటాయింపులో చంద్రబాబు మార్క్ కనిపించిందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దుల్లేవు. తమ ఆనందాన్ని, టీడీపీకి తమ మద్దతును ఆ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. తాజాగా పలువురు తమ బైక్‌లపై విజయవాడ ఎంపీ గారి తాలూకా అంటూ స్టిక్కర్లు ముద్రిస్తున్నారు. విజయవాడ ఎంపీ చిన్ని ఫోటో, ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీతో తిరుగుతున్న బైక్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.