Krishna

News June 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు కీలక శాఖలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ(కొడాలి నాని), జోగి రమేశ్(గృహ నిర్మాణ శాఖ), పేర్ని నాని(సమాచార శాఖ), దేవాదాయ శాఖ(వెల్లంపల్లి)లు దక్కిన విషయం తెలిసిందే. తాజా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ(కొల్లు రవీంద్ర), హౌసింగ్, సమాచార శాఖ(కొలుసు పార్థసారథి)లను కేటాయించారు.

News June 14, 2024

BREAKING: ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులకు శాఖల కేటాయింపు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రులుగా ప్రమాణ చేసిన ఇద్దరికి సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు భూగర్భ గనుల, ఎక్సైజ్ శాఖ దక్కింది. నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి సమాచార, గృహనిర్మాణ శాఖ కేటాయించారు. దీంతో రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది.

News June 14, 2024

మెగా DSC నోటిఫికేషన్ విడుదల.. నిరుద్యోగుల్లో ఉత్సాహం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత మెగా DSC నోటిఫికేషన్ విడుదలతో ఉత్సాహం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో 2,636 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాలో కేవలం 180 పోస్టులనే చూపించారని, 1,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని DSC అభ్యర్థులు చెబుతున్నారు. తాజా నోటిఫికేషన్‌తో జిల్లాలో గరిష్ఠంగా టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News June 14, 2024

కృష్ణా: విధుల్లో తిరిగి చేరిన 85 మంది ఉపాధ్యాయులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 85 మంది ఒప్పంద ఉపాధ్యాయులను, అధ్యాపకులను గురువారం నుంచి విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ DCO సుమిత్రాదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 విద్యా సంవత్సరంలో SSC, ఇంటర్ ఫలితాలలో ఆయా ఉపాధ్యాయులు సాధించిన ఉత్తమ ఫలితాల ఆధారంగా వారిని మరలా విధుల్లోకి చేర్చుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News June 14, 2024

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

image

కృత్తివెన్నులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు నేడు వర్షసూచన

image

కృష్ణా జిల్లా పరిధిలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News June 14, 2024

రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యధావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.* నం.07864 గుంటూరు- విజయవాడ* నం.07628 విజయవాడ- గుంటూరు* నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్* నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ

News June 13, 2024

కృష్ణా: పలు పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. ఏయే ఫలితాలు విడుదల అయ్యాయంటే.. ☞ ఫార్మ్-డీ 1వ సెమిస్టర్ ☞ LLB కోర్సు 5వ సెమిస్టర్ ☞ బీ ఫార్మసీ 1వ సెమిస్టర్

News June 13, 2024

బైక్‌పై సచివాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర

image

మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్‌లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్‌పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

News June 13, 2024

బైక్‌పై సచివాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర

image

మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్‌లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్‌పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.