Krishna

News June 13, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నంబర్లను మార్చినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.17488 విశాఖపట్నం- కడప ట్రైన్‌కు 18521నంబరు, నం.17487 కడప- విశాఖపట్నం ట్రైన్‌కు 18522 నెంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 13, 2024

విజయవాడలో శ్రీకాకుళం హెడ్ కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య రెడ్డి CM ప్రమాణ స్వీకార బందోబస్త్‌లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేట తరలించారు.

News June 13, 2024

కృష్ణా: ఒక్క సంతకంతో 4.78లక్షల మందికి లబ్ధి

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ అనంతరం నేడు పింఛను రూ.4 వేలకు పెంచుతూ.. మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంతకంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న 4,78,736 మందికి జూలై నుంచి పెరిగిన పింఛన్ సొమ్ము అందనుంది. కాగా అధికారిక డాష్‌బోర్డు సమాచారం ప్రకారం జూన్ నాటికి మొత్తంగా కృష్ణా జిల్లాలో 2,42,856, ఎన్టీఆర్ జిల్లాలో 2,35,880 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.

News June 13, 2024

మరి కాసేపట్లో దుర్గమ్మని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 2.40నిమిషాల మధ్యలో అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్ళనున్నట్లు సమాచారం.

News June 13, 2024

సముద్ర స్నానానికి వెళ్లి కృష్ణా జిల్లా వాసి మృతి

image

తాడిగడపకు చెందిన రత్నకుమారి(57)కర్ణాటకలోని మంగళూరు బీచ్‌లో మునిగి మరణించింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు రత్నకుమారి తన 5మంది స్నేహితురాళ్లతో కలిసి వారం క్రితం మైసూరుకు వెళ్లారు. పలు పుణ్యక్షేత్రాలు సందర్శించి మంగళవారం ఉళ్లాల బీచ్‌‌లో స్నానం చేస్తుండగా..భారీ అలలు వారిని సముద్రంలోకి లాక్కువెళ్లాయి. గజ ఈతగాళ్లు వారిని ఒడ్డుకు తీసుకువచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రత్నకుమారి మృతిచెందినట్లు తెలిపారు.

News June 13, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07864 గుంటూరు- విజయవాడ ట్రైన్‌ను ఈ నెల 24 నుంచి ఆగస్టు 15 వరకు, నం.07628 విజయవాడ- గుంటూరు ట్రైన్‌ను ఈ నెల 21 నుంచి ఆగస్టు 12 వరకు రద్దు చేశామంది. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని కోరింది.

News June 13, 2024

35ఏళ్లకు ‘నూజివీడు’కు మంత్రి పదవి

image

35ఏళ్ల తర్వాత ‘నూజివీడు’కు మంత్రి పదవి దక్కింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1952-72 వరకు వరుసగా 5సార్లు MLAగా గెలిచిన డా.ఎంఆర్ అప్పారావు, తర్వాత 1978, 1989లో గెలుపొందిన పాలడుగు వెంకటరావు మాత్రమే మంత్రులుగా పని చేశారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన కొలుసు.. 2009లో YSR, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.

News June 13, 2024

కృష్ణా జిల్లాలో ఆ నేతను శాసనసభ స్పీకర్ పదవి వరించేనా..?

image

CBN మంత్రివర్గంలో ఉమ్మడి కృష్ణా నుంచి ఇద్దరికి చోటు దక్కగా కొందరు సీనియర్లకు స్థానం లభించలేదు. అవనిగడ్డ నుంచి 4వ సారి అసెంబ్లీకి ఎన్నికైన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు కేబినెట్ చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మంత్రివర్గంలో మండలికి చోటు దక్కకపోవడంతో ఆయనకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

News June 13, 2024

మంత్రివర్గంలో ఎన్టీఆర్ జిల్లాకు దక్కని ప్రాధాన్యత

image

ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. బొండా ఉమా, గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాస్‌తో పాటు బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి పేర్లు సైతం తొలుత ఆశావాహుల జాబితాలో వినిపించాయి. కాగా చంద్రబాబు తన మంత్రివర్గంలో ఒక స్థానాన్ని నేడు ఎవరికీ కేటాయించకుండా ఉంచారని, అది ఎన్టీఆర్ జిల్లా నేతలకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News June 12, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రేపు గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వారు బుధవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద గాని, కరెంట్ పోల్స్ వద్ద గాని ఉండవద్దని, కురిసే వర్షాలకు అనుగుణంగా లోతట్టు ప్రాంత వాసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.