India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ ఆయన చాంబర్లో కార్మిక, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోస్టల్ విడుదల చేశారు.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. ఆమె తమ్ముడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేసరపల్లిలోని చంద్రబాబు ప్రమాణస్వీకారానికి విచ్చేసిన ఆమె వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అక్క భువనేశ్వరి భుజం తట్టి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టారు. ఈ దృశ్యం వేదికపై కూర్చున్నవారిని ఆకట్టుకుంది.
ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లికి బయల్దేరారు. కొద్దిసేపటి కిందటే విమానాశ్రయంలో ప్రధానికి చంద్రబాబు, గవర్నర్ స్వాగతం పలికారు. అనంతరం వారు కేసరపల్లిలోని సభా స్థలికి బయల్దేరారు. 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన ఆయనకు గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ముగ్గురూ గన్నవరం ఐటీ పార్కులోని ప్రమాణస్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.
గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రజానీకం భారీగా బయలుదేరిన నేపథ్యంలో జాతీయ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పొట్టిపాడు, కాజా టోల్ ప్లాజాలతో పాటు ఇబ్రహీంపట్నం, వారధి తదితర ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాయలసీమను నుండి భారీగా వచ్చిన వాహనాలతో వారధి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి.
కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన.. త్వరలో వచ్చి నియోజకవర్గ ప్రజలను కలుస్తానని చెప్పారు.
చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొలుసు పార్థసారథి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. పెనమలూరులో వైసీపీ సిట్టింగ్ MLAగా ఉన్న ఆయనను చంద్రబాబు నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సైతం పరిష్కరించి క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించిన పార్థసారథి.. నూజివీడులో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరేసి తాజాగా మంత్రి పదవి చేపట్టనున్నారు.
ఏపీలోని నాలుగు ఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎప్పటి వరకు 48 వేల దరఖాస్తులు అందినట్లు అడ్మిషన్లు కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు ఐటీలలో కలిపి ఈ డబ్ల్యూఎస్ కోట కలిపి 4400 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులు జాబితాలో జూలై 11న విడుదల చేస్తామని వివరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలల విద్యార్థులు గమనించాలని విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటన వెలువరించింది. కాగా నేడు సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున ఈ రోజు పాఠశాలలకు విద్యాశాఖ సెలవును ప్రకటించింది.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మంగళవారం మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్న రజనీని.. పాత పరిచయంతో కలిసి ముచ్చటించారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తున్న ఆయనతో మాట్లాడుతూ.. ‘సార్.. గతంలో మీరు చంద్రబాబును పొగిడినప్పుడు.. మిమ్మల్ని తిట్టిన వాళ్లంతా ఓడిపోయారు’ అని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఇరువురూ ఒకే ఫ్లైట్‌లో గన్నవరం ఎయిర్ పోర్ట్‌కి వచ్చారు.
Sorry, no posts matched your criteria.