Krishna

News June 12, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై 36 మంది

image

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ మాఝి, చిరాగ్ పాశ్వాన్, నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి, కె.రామ్మోహన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, చిరంజీవి, రజినీకాంత్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్.. తదితరులు ఆశీనులు కానున్నారు.

News June 12, 2024

కృష్ణా జిల్లా నుంచి మంత్రులు వీరే..

image

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), పార్థసారథి(నూజివీడు)కు చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ గతంలో మంత్రులుగా పనిచేశారు. కొల్లు రవీంద్ర గత టీడీపీ ప్రభుత్వంలో, పార్థసారథి వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా సేవలందించారు.

News June 11, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రేపు బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వారు మంగళవారం సాయంత్రం వెల్లడించారు. ఆయా జిల్లాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతవాసులు కురిసే వర్షాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కిందకు వెళ్ళవద్దని సూచించారు.

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. 7 వేల మంది పోలీసులతో బందోబస్తు

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.

News June 11, 2024

పాస్‌లు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి: సీపీ రామకృష్ణ

image

రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో విజయవాడ నుంచి, ఇతర ప్రదేశాల నుంచి గన్నవరం ఫంక్షన్ ప్లేస్‌కు పాస్‌లు ఉన్న బస్సులు, కార్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని పోలిస్ కమిషనర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. పాస్‌లు లేని ఇతర వాహనాలు అనుమతించబడదని, విజయవాడలోని 9 ప్రాంతాల నుంచి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రామాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు.

News June 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నరసాపురం, భీమవరం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే నాలుగు రైళ్లు జూన్ 24 నుంచి జూలై 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. మచిలీపట్నం(02), నరసాపురం(01), భీమవరం(01) వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి. 

News June 11, 2024

విజయవాడ: మీడియాను పునరుద్ధరించాలంటూ ఎంపీ లేఖ

image

ఏపీలో మీడియాను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ట్రాయ్‌కి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పలు ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేసేలా కేబుల్ ఆపరేటర్లపై కొత్త ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకుని ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు.  

News June 11, 2024

కృష్ణా: ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన MA, MCOM, MHR 4వ సెమిస్టర్ పరీక్షలకు(23-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 18లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News June 11, 2024

గన్నవరం: ఎయిర్‌పోర్టులో సిద్ధమవుతున్న 12 హెలిప్యాడ్లు

image

రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం నిమిత్తం గన్నవరంలో 12 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక నిమిత్తం వీఐపీల కాన్వాయ్ వెళ్లే దారిలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వివరాలు వెల్లడించింది. 

News June 11, 2024

విజయవాడ: గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు

image

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్‌కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.