Krishna

News June 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముస్తాబాద- గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.06521 SMV బెంగుళూరు- గువాహటి ట్రైన్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్‌ ఈ నెల 11 నుంచి 25 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 11, 2024

మచిలీపట్నం వద్ద లారీ కిందపడి మహిళ మృతి

image

మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రేపల్లెకు చెందిన మోపిదేవి రాజేశ్వరి అనే మహిళ మృతి చెందింది. తన భర్త, కుమారుడితో కలిసి తాళ్లపాలెంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయగా.. రాజేశ్వరి ప్రమాదవశాత్తు లారీ కింద పడింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

News June 11, 2024

కృష్ణా: డిప్లొమా కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

భావదేవరపల్లిలోని ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన అభ్యర్థులు https://apfu.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నెల 10 నుంచి 26లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఏ చంద్రశేఖరరావు తెలిపారు. అడ్మిషన్లకు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించమని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చని ఆయన స్పష్టం చేశారు.

News June 11, 2024

కృష్ణా: చెన్నై వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక

image

గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున బుధవారం ట్రాఫిక్‌ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే రవాణా వాహనాలు హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుమూడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలన్నారు.

News June 11, 2024

కృష్ణా: రేపు ఏఏ వాహనాలను అనుమతిస్తారంటే.!

image

గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్నందున వాహనాలను మళ్లిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లే పాసులు ఉన్న వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర ఆరోగ్య చికిత్స ఉన్న వాహనాలనే రేపు ఉదయం రామవరప్పాడు రింగ్ సెంటర్ నుంచి గన్నవరం వైపు అనుమతిస్తామని, ప్రజలు తమకు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు.

News June 11, 2024

పెడన: ఇద్దరు వీవీఎలు సస్పెండ్

image

పెడన మండలంలో ఇటీవల వెలుగు చూసిన ఇన్‌పుట్ సబ్సిడీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో ఇద్దరు VVAలను సస్పెండ్ చేసినట్టు, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి జ్యోతి తెలిపారు. ప్రాథమిక విచారణలో మడక, శింగరాయపాలెం వీవీఎల పాత్ర ఉన్నట్టు గుర్తించామన్నారు. 152 మంది నకిలీ ఖాతాలకు రూ.40 లక్షలకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ జమ అయినట్టు విచారణలో తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News June 11, 2024

‘చంద్రబాబు ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి’

image

ఈ నెల 12న గన్నవరం మండలం కేసరపల్లిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

News June 11, 2024

VJA: పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

భారత ప్రభుత్వ సూచనల మేరకు ఏపీ 2025లో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు సామజిక సేవా, సైన్స్, ప్రజా సంబంధాలు, సివిల్ సర్వీస్ రంగాలలో విశిష్ట సేవలు అందించినవారు అర్హులని అన్నారు. వీరు https//awards.giv.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 11, 2024

నేడు విజయవాడలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం

image

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్‌కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కూటమి బృందం కోరనుంది.

News June 10, 2024

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి నూతన వాహనాలు

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి రెండు నూతన బొలెరో కార్లను ఉన్నతాధికారులు మంజూరు చేశారు. సోమవారం విజయవాడలో వీటిని సంబంధిత సిబ్బందికి విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ అందచేశారు. డివిజన్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఈ ఏడాది మే నెల వరకు 61 మంది చిన్నారులను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రక్షించిందని నరేంద్రపాటిల్ తెలిపారు.