Krishna

News March 28, 2024

విజయవాడలో 9న పలు అర్జీత సేవల రద్దు

image

ఉగాది పండుగను పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదిన ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు తెల్లవారు జామున అమ్మవారి ఆలయం చుట్టూ జరిగే ప్రదక్షిణలను నిలిపివేయనున్నారు. సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ, ఖడ్గమార్చనచ నవగ్రహ శాంతి హామం, పల్లకీ సేవలను నిపుదల చేస్తామని చెప్పారు.

News March 28, 2024

అవనిగడ్డ ఒక్కటే మిగిలింది.!

image

కైకలూరు, విజయవాడ వెస్ట్ NDA అభ్యర్థులను నిన్న ప్రకటించారు. దీంతో ఉమ్మడి కృష్ణాలోని 16 సీట్లలో 15 మంది అభ్యర్థులెవరో తెలిసిపోయింది. జనసేనకు కేటాయించిన అవనిగడ్డ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. వంగవీటి రాధ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నా ఫైనల్ కాలేదు. మరోవైపు మండలి బుద్ధప్రసాద్ వర్గం TDPకే టికెట్ ఇవ్వాలని నిరసన తెలుపుతోంది. ఈ క్రమంలో అవనిగడ్డ టికెట్ ఎవరికిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.

News March 28, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నందున మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.17220 విశాఖపట్నం- మచిలీపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 29 వరకు, నెం.17219 మచిలీపట్నం- విశాఖపట్నం ట్రైన్‌ను ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 28 వరకు రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News March 28, 2024

ఎన్నిక‌ల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి: ఢిల్లీరావు

image

రాజ‌కీయ పార్టీలు, అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఇత‌ర అనుమ‌తుల మంజూరుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ప‌రిశీలించి అనుమ‌తులు ఇస్తామని జిల్లా ఎన్నిక‌ల అధికారి ఢిల్లీరావు తెలియ‌జేశారు. నేడు గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో కలెక్టర్ తన కార్యాలయంలో స‌మావేశం నిర్వ‌హించారు. అభ్య‌ర్థులు, పార్టీలు నేరుగా లేదా ఆన్‌లైన్లో సువిధ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌న్నారు.

News March 27, 2024

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం

image

విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు, జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చలు కొనసాగినట్లు సమాచారం.

News March 27, 2024

మచిలీపట్నం: కలెక్టర్‌ను కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారిణి

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా విజయవంతం అయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబును డీఈఓ తాహేరా సుల్తానా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాశాఖ పట్ల గౌరవం కనబరిచిన కలెక్టర్‌కు డీఈవో పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో ఘంటసాల మండల ఎంఈఓ మోమిన్, తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2024

విజయవాడ వెస్ట్‌ అభ్యర్థిగా సుజనా చౌదరి

image

విజయవాడ వెస్ట్‌ టికెట్‌పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. బుధవారం బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ ఖరారు చేశారు. దీంతో నియోజక వర్గంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News March 27, 2024

విజయవాడ: కలెక్టర్, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స‌చివాల‌యం నుంచి బుధవారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లాల ఎన్నిక‌ల అధికారుల‌తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని సీ విజిల్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు అన్నారు.

News March 27, 2024

కృష్ణా : ఈ నెల 30తో ముగియనున్న ధాన్యం కొనుగోళ్ల గడువు

image

ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.

News March 27, 2024

మచిలీపట్నం MP, అవనిగడ్డ MLA అభ్యర్థులు ఖరారు?

image

మచిలీపట్నం పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు పార్టీ అధినేత పవన్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పేరు కూడా ఫైనల్ చేశారని తెలుస్తోంది. రేపు వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారైతే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి.