India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంతకన్నా మెరుగ్గా విజయవాడ నగరానికి సేవలందిద్దామని శుక్రవారం నగర క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఏపీ, ఎస్సీ ఎన్జీవోస్లో ఖాళీ అయిన పదవులు కో ఆప్షన్ పద్ధతిలో.. ఎన్నిక కాబడిన నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాసరావు, ఎస్.కె నజరుద్దీన్, బిఎస్ఎన్ శ్రీనివాస్ సంఘ నాయకులతో కలసి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఢిల్లీ రావుకు పుష్పగుచ్చం అందజేశారు.
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 12 ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నేతలు టీడీ జనార్దన్, అచ్చెన్నాయుడు తదితరులు శుక్రవారం కేసరపల్లిలో ఎంపిక చేసిన సభాస్థలాన్ని పరిశీలించారు.
మే 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ప్రకటించారు. 16వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు.. తదుపరి 48 గంటల వరకు ఈ నియమావళి అమలులో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతతో గోదాములో భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ డిల్లీరావు వెల్లడించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయినందున.. గొల్లపూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచి శుక్రవారం సీల్ వేశారు.
విజయవాడ లోక్‌సభకు 1952 నుంచి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికలలో కేశినేని శివనాథ్ (చిన్ని) సాధించిన 2,82,085 మెజారిటీనే అత్యధికం. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన KLరావు సాధించిన 1,56,004 ఓట్ల మెజారిటీని తాజా ఎన్నికల్లో చిన్ని తన భారీ మెజారిటీతో చెరిపేశారు. చిన్ని తాజా గెలుపుతో విజయవాడ లోక్‌సభలో వరుసగా 3వ సారి టీడీపీ జెండా ఎగిరింది.
నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు(సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. నేడు విజయవాడలో అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిబద్దతతో వ్యవహరిస్తూ.. విధులు నిర్వర్తించారని తెలిపారు. అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీ- ఫార్మసీ ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.