Krishna

News June 4, 2024

మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యం

image

మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పేర్ని కిట్టుపై 1979 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యం

image

పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కైలే అనీల్ పై 2403 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడ పార్లమెంట్ తొలి రౌండ్‌‌లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 13 వేల ఓట్ల ఆధిక్యంలో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆధిక్యంలో ఉన్నది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కింది స్థానాల్లో తొలి రౌండ్లలో NDA కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారని సమాచారం వెలువడింది.
తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్(టీడీపీ)
గుడివాడ- వెనిగండ్ల రాము(టీడీపీ)
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర(టీడీపీ)
విజయవాడ పశ్చిమ- సుజనా చౌదరి(బిజెపి)
విజయవాడ సెంట్రల్- బొండా ఉమ(టీడీపీ)

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్‌లో కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కేశినేని నాని కంటే ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఎన్టీఆర్: కౌంటింగ్ కేంద్రం వద్ద అల్పాహారం కొరత

image

ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో అల్పాహారం కొరత వచ్చిందని ఏజెంట్ల ఆందోళన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే కౌంటింగ్ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. సిబ్బందికి భద్రతా, భోజన ఏర్పాట్లు అక్రమంగా ఉండాలని వారి కోరారు.

News June 4, 2024

కృష్ణా: పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

image

విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
*నం.07464 విజయవాడ- గుంటూరు
*నం.07465 గుంటూరు- విజయవాడ
*నం.07976 గుంటూరు- విజయవాడ

News June 3, 2024

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్: డీకే బాలాజీ

image

మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌లో పాల్గొని సిబ్బందిని తేలికగా గుర్తించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. మీడియాకు సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

News June 3, 2024

1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమం: ముకేశ్ కుమార్ మీనా

image

కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి, బైండోవర్ చేశామన్నారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని స్పష్టం చేశారు.

News June 3, 2024

3000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు: సీపీ రామకృష్ణ

image

3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రామకృష్ణ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులకి, సిబ్బందికి సీపీ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కౌంటింగ్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

error: Content is protected !!