India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం, పెడనలో టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్‌లిద్దరూ గెలుపొందారు. వీరి తండ్రులు వసంత నాగేశ్వరరావు, కాగిత వెంకట్రావులు సైతం గతంలో టీడీపీ నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో కాగిత పెడనలో 38,123 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముపై, వసంత మైలవరంలో 42,829 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిపై గెలిచారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ కలెక్టరేట్లో గుడ్డ, నారతో చేసిన పర్యావరణహిత సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టాలన్నారు. గుడ్డ, నారతో చేసిన సంచులనే వాడాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత జీవన శైలి అలవర్చుకోవాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా, ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరిచామని పేర్కొన్నారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు, గొడవలకు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరఫున పోటీ చేసిన మంత్రుల పైనే కూటమి అభ్యర్థులు ఎక్కువ మెజారిటీ సాధించారు. పెనమలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో 59,915 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అటు సెంట్రల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా 68,886 ఓట్ల తేడాతో ఉమ చేతిలో ఓడిపోయారు. కాగా ఉమ్మడి కృష్ణాలో ఈ మెజార్టీలే అత్యధికం.
1967లో ఏర్పడిన విజయవాడ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఎమ్మెల్యేగా టీడీపీ నేత గద్దె రామ్మోహన్ రికార్డ్ సృష్టించారు. 2014,19లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గద్దె తాజా ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్ పై 49,640 ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గి విజయవాడ తూర్పులో మొట్టమొదటి హ్యాట్రిక్ కొట్టిన నేతగా రికార్డ్ సృష్టించారు.
2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.
కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన ఆయన ఈ ఎన్నికల్లో పెనమలూరు బరిలో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్‌పై పోటీ చేసి 59,915 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గం మారడం, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, టీడీపీ కంచుకోట నుంచి పోటీ చేయడం జోగి రమేశ్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది MLA అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని చిన్నికి 2,82,085, బాలశౌరికి 2,16,938 మెజార్టీ వచ్చింది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి 47,032 మెజార్టీతో గెలిచారు.
మచిలీపట్నంలో పొలిటికల్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఇక్కడ గెలుపొందిన పార్టీనే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగుతోంది. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బొర్రా వెంకట స్వామితో ప్రారంభమైన ఈ సెంటిమెంట్ తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మరింత ముందుకు తీసుకువెళ్లారు.
విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 2019లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఉమ 68,886 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌పై గెలుపొంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో నెగ్గిన ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాక ఉమ సాధించిన 68,886 మెజారిటీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం.
Sorry, no posts matched your criteria.