Krishna

News March 22, 2024

విజయవాడలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.

News March 22, 2024

ఫిర్యాదుల ప‌రిష్కార నాణ్య‌త‌పై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. సీ-విజిల్‌, 1950 హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ), క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051) త‌దిత‌రాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో, స‌త్వ‌ర ప‌రిష్కారంపై దృష్టిసారించాల‌ని అధికారులకు సూచించారు.

News March 22, 2024

దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్‌పై సందిగ్ధత

image

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్త్‌పై సందిగ్ధత నెలకొంది. నేడు ప్రకటించిన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు సీటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు.

News March 22, 2024

విజయవాడ: సివిల్ సర్వీసెస్‌లో మహేశ్‌కు కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.

News March 22, 2024

చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగ్గయ్యపేట వాసి మృతి

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.

News March 22, 2024

విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

image

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయంపై దాడి

image

గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయ తలుపులు పగుల గొట్టి, కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News March 22, 2024

కృష్ణా: జడ్పీ సీఈఓ జ్యోతిబసు బదిలీ

image

జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీర్ల జ్యోతిబసు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు జ్యోతి బసును బదిలీ చేశారు.

News March 22, 2024

కోడూరు: విధుల నుంచి వాలంటీర్ తొలగింపు

image

కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.

News March 22, 2024

ఉయ్యూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఉయ్యూరులో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఉయ్యూరు టౌన్ సిఐ హబీబ్ బాషా తెలిపిన వివరాలు మేరకు.. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. ముగ్గురు మహిళలు, ఓ విటుడుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉయ్యూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.